ETV Bharat / entertainment

'హ్యాపీ డాడ్​'గా చెర్రీ - ఫ్యామిలీ ఈవెంట్​లో సిస్టర్స్​తో క్లీంకార సందడి - క్లీం కార లేటెస్ట్ ఫొటోస్

Upasana Latest tweet : గ్లోబల్ స్టార్ రామ్​చరణ్​ సతీమణి ఉపాసన కొణిదెల తాజాగా ఓ ఫ్యామిలీ ఈవెంట్​లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తీసిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఆ విశేషాలు మీ కోసం

Upasana Latest tweet
Upasana Latest tweet
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 12, 2024, 8:57 PM IST

Upasana Latest tweet : తన పర్సనల్ లైఫ్​తో పాటు ప్రొఫషనల్ లైఫ్​కు సంబంధించిన అనేక విశేషాలను ఫ్యాన్స్​తో పంచుకుంటుంటారు మెగా కోడలు ఉపాసన. ఇక క్లీంకార పుట్టాక పలు ఫ్యామిలీ ఫొటోలను షేర్​ చేసినప్పటికీ అందులో ఆ చిన్నారి ఫేస్​ను మాత్రం రివీల్ చేయలేదు. దీంతో చెర్రీ గారాల పట్టీ ఎలా ఉండనుందో అంటూ ఫ్యాన్స్​లో క్యూరియాసిటీ పెరిగిపోయింది.

అయితే తాజాగా రామ్‌చరణ్‌ దంపతులు ఓ ఫ్యామిలీ ఈవెంట్​లో పాల్గొన్నారు. అక్కడ తీసిన ఓ ఫొటోను ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉపాసన సిస్టర్‌ అనుష్పాల ఫ్యామిలీతో కలిసి చెర్రీ దంపతులు దిగిన ఫొటోను ఆమె షేర్‌ చేశారు.

"ఈ రోజు నేను మీకు అద్భుతమైన ముగ్గురు చిన్నారి బాలికలను పరిచయం చేస్తున్నాం. పవర్ పఫ్​ గర్ల్స్​ . క్లీంకార కొణిదెల ఇప్పుడు తన ఇద్దరు చెల్లెళ్లు ఐరా పుష్ప ఇబ్రహీం, రైకా సుచరిత ఇబ్రహీంలను కలుసుకుంది" అంటూ ఓ క్యూట్​ క్యాఫ్షన్​ను రాసుకొచ్చారు.

ఇక ఈ ఫొటోలో చెర్రీ తన గారాల పట్టిని ఎత్తుకుని ఎంతో ఆనందంగా ఫొటోకు ఫోజిచ్చారు. అయితే ఇక్కడ కూడా ఈ దంపతులు క్లీంకార ఫేస్​ రివీల్​ కాకుండా జాగ్రత్తపడ్డారు. ఇది చూసిన కొందరు ఫ్యాన్స్​ 'క్యూట్‌', 'బ్యూటీఫుల్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరేమో ఎప్పుడు చిన్నారి ఫేస్​ రివీల్​ చేస్తారంటూ అడుగుతున్నారు.

Upasana Sister Marriage : అనుష్పాల, ప్రముఖ కార్ రేసర్ అర్మాన్ ఇబ్రహీంల వివాహం 2021లో జరిగింది. ఈ ఏడాది జనవరి 23న అనుష్పాల, ఇబ్రహీం పండంటి కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారులకు నిర్వహించిన బారసాల ఫంక్షన్​కు ఉపాసన, రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోనే ఉపాసన తాజాగా పంచుకున్నారు.

Ram Charan Baby : క్లీంకార రాకతో మెగా ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరిసిందన్న సంగతి తెలిసిందే. ఇక క్లీంకారతో కలిసి మెగాస్టార్ చిరంజీవి దిగినవి, మనవరాలిని ఎత్తుకుని చిరు సంబరపోతూ ఉన్న ఫోటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. మెగా ప్రిన్సెస్ కొణిదెల ఇంటికి వచ్చిన తరుణంలో చిరంజీవి ప్రత్యేకంగా వేదమంత్రాలు పఠించే వారిని తీసుకొచ్చి మరీ ఆహ్వానం పలికించారు. తాజాగా సంక్రాంతి సందర్భంగా మెగా మనవరాళ్లతో చిరు తీసుకున్న ఫొటో కూడా అప్పట్లో వైరలైంది.

మెగా మనవరాళ్లతో చిరు - క్లీంకార ఫొటోతో ఉపాసన సర్​ప్రైజ్​!

'ఫోర్బ్స్' మ్యాగజైన్​పై స్టైలిష్​గా చెర్రీ, ఉప్సీ- టాలీవుడ్​ ఫస్ట్ కపుల్​గా ఘనత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.