ETV Bharat / entertainment

'ఆ సినిమా తర్వాత సెట్​లో తన ట్రీట్మెంటే మారిపోయింది - అందరూ అలా చేస్తున్నారు' - Tripti Dimri Dhadak 2 - TRIPTI DIMRI DHADAK 2

Tripti Dimri Dhadak 2 : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిప్తి దిమ్రీ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని రివీల్ చేశారు ఓ యంగ్ హీరో. ఆ సినిమా విడుదల తర్వాత త్రిప్తి కెరీర్​లో అనేక మార్పులు వచ్చాయని అన్నారు. ఇంతకీ అదేంటంటే?

Tripti Dimri Dhadak 2
Tripti Dimri Dhadak 2 (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 1, 2024, 1:10 PM IST

Tripti Dimri Dhadak 2 : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిప్తి దిమ్రీ తాజాగా 'ధడక్‌ 2' సెట్స్​లోకి అడుగుపెట్టింది. జాన్వీకపూర్ డెబ్యూ మూవీకి సీక్వెల్​గా ఇది తెరకెక్కనుంది. ఇందులో త్రిప్తితో పాటు యంగ్ హీరో సిద్ధాంత్​ చతుర్వేది కూడా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ యంగ్ హీరో త్రిప్తి గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని రివీల్ చేశారు. 'యానిమల్' తర్వాత ఆమె లైఫ్​లో కొన్ని మార్పులు వచ్చాయని పేర్కొన్నారు.

"యానిమల్‌ రిలీజ్ తర్వాత త్రిప్తిని ట్రీట్‌ చేసే విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఆమె ప్రతి రోజూ ప్రొడక్షన్‌ వారిని టీ అడిగేది. కానీ, తనను ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం మసాలా టీ కావాలా? గ్రీన్‌ టీ కావాలా? అంటూ వారే ఆమెను అడగటం మొదలెట్టారు. (నవ్వుతూ). యానిమల్‌లో ఆమె చేసింది చిన్న పాత్రే అయినా కూడా తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. త్రిప్తి చాలా మంచి అమ్మాయి, ఎంతో సరదాగా ఉంటుంది" అంటూ సిద్ధాంత్‌ షూటింగ్ ముచ్చట్లు చెప్పుకొచ్చారు.

కుర్రాళ్ల క్రష్​
'యానిమల్'​తో ఒక్కసారిగా స్టార్​డమ్​ సంపాదించుకుంది త్రిప్తి దిమ్రీ. ఇందులో ఆమె నటకు ఫిదా అయ్యి కుర్రాళ్లు ఈమెను తన క్రష్ లిస్ట్​లో చేర్చుకున్నారు. దీంతో ఆమె క్రమంగా నేషనల్‌ క్రష్‌గా ఇమేజ్​ ట్యాగ్​ను కూడా దక్కించుకుంది. అయితే ఇలా తనను పిలవడం పట్ల త్రిప్తి తాజాగా స్పందించింది.

"బాలీవుడ్‌లో నా కెరీర్‌ ప్రారంభించి దాదాపు ఏడేళ్లైంది. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. గొప్ప నటీనటులు, దర్శకులతో పనిచేస్తానని అస్సలు అనుకోలేదు. నేను ముందు నటనను అంత సీరియస్‌గా తీసుకోలేదు. తొలి సినిమా పూర్తవ్వగానే నా కెరీర్‌ను విధికే వదిలేశాను. అదృష్టం ఉంటే మరో సినిమా రావొచ్చని అనుకున్నాను. అప్పుడే లైలా మజ్ను కోసం ఆడిషన్‌లో పాల్గొన్నా. ఇక అప్పటి నుంచి నటనపై ఫోకస్ చేశాను.ఆడియెన్స్​ నా యాక్టింగ్​తో కనెక్ట్‌ అవుతున్నారు. నేషనల్​ క్రష్​ అనేది నా దృష్టిలో ఓ ట్యాగ్‌ మాత్రమే కాదు. అభిమానుల ప్రేమ. వాళ్లు అలా పిలుస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. దీంతో నాపై మరింత బాధ్యత కూడా పెరిగింది." అంటూ త్రిప్తి క్యూట్​గా రియాక్ట్ అయ్యింది.

అతడితో ప్రేమలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి - ఫొటో షేర్ చేసిన ప్రియుడు!

త్రిప్తి దిమ్రీ బ్యాడ్ న్యూజ్​ - యానిమల్ బ్యూటీ రొమాన్స్​ మాయ చేసినట్టేనా? - Tripti Dimri Bad Newz Review

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.