Top 10 Movies about Cricket : క్రికెట్ - ఈ క్రీడకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ స్పోర్ట్‌పై ఆసక్తి కనబరిచేవాళ్లు కొన్ని కోట్లలోనే ఉన్నారు. టోర్నీలు మొదలయ్యాయంటే ఇక చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ టీవీలకు అతుక్కుపోతుంటారు. స్టేడియాలకు బారులు తీసి తమ అభిమాన జట్టును ఉత్తేజపరుస్తుంటారు. అయితే ఇదే క్రీడను వెండితెరపై చూపించే ప్రయత్నం చేశారు కొందరు డైరెక్టర్లు. రియల్ ఇన్సిడెంట్స్, ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఇలా క్రికెట్‌ను పలు రకాలుగా సినిమాల్లో చూపించి ప్రేక్షకులను అలరించారు. వీటిని చూస్తే క్రికెట్‌పై ఇంట్రెస్ట్ లేని వాళ్లకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అలాంటి టాప్-10 మూవీస్ ఏవంటే?
1. లగాన్ (2001)
క్రికెట్ పై చాలా మందికి ఆసక్తిని కలిగించిన సినిమాల్లో 'లగాన్' ముందుంటుంది. స్వాతంత్య్ర ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ స్టోరీ సినీ లవర్స్‌ను ఆకట్టుకుంది. స్వాతంత్ర్యం కోసం ఓ గ్రామ ప్రజలు బ్రిటీషర్స్తో క్రికెట్ పోటీ పెట్టుకుంటారు. అందులో ఆ గ్రామ ప్రజలు విజయం సాధిస్తారు. అద్భుతమైన, ఉత్కంఠమైన కథాంశం, సీన్లు ఆకట్టుకుంటాయి. ఇప్పటికీ ఇదొక మాస్టర్ పీస్. అమీర్ ఖాన్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ పలు అవార్డులను సైతం అందుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2. ఇక్బాల్ (2005)
క్రికెట్ ఆడాలనే కోరిక బలంగా ఉన్న ఓ చెవిటి, మూగ బాలుడి కథ ఇది. నగేశ్ కుకునూర్ స్వీయ రచన, డైరెక్షన్లో తెరకెక్కింది. ఎమోషనల్‌తో పాటు ఇన్స్పిరేషనల్గా సాగే ఈ సినిమా ప్రేక్షకుల మనసులను కదిలించింది. అంతే కాకుండా ఈ మూవీకి ఉత్తమ జాతీయ చిత్రం అవార్డు కూడా దక్కింది.
3. చైన్ కులీ కి మెయిన్ కులీ (2007)
ఓ అనాథ పిల్లాడు తనకు దొరికిన మాయా బ్యాట్‌తో క్రికెట్లో పలు అద్భుతాలు సృష్టిస్తుంటాడు. ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా ఆద్యంతం ఆసక్తిగా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ టీమ్ఇండియా క్రికెటర్ కపిల్ దేవ్ కూడా అతిథి పాత్రలో కనిపిస్తారు.
4. ఫెరారీ కి సవారీ (2012)
తన కొడుకు కలను నెరవేర్చేందుకు తన తండ్రి పడే కష్టం ఈ సినిమాలో చూపిస్తారు డైరక్టర్. ఓ చిన్నారి లార్డ్స్‌లో క్రికెట్ ఆడాలన్న కలను నిజం చేయడానికి తండ్రి ఫెరారీ కారును సైతం దొంగిలిస్తాడు. కుటుంబ నేపథ్యంతో సాగే ఒక ఎమోషన్ ఫీల్ గుడ్ మూవీ ఇది.
5. ధోని - ది అన్‌టోల్డ్ స్టోరీ (2016)
చెన్నై సూపర్ కింగ్స్ సారధి, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిందే 'ధోని - ది అన్‌టోల్డ్ స్టోరీ'. ఇందులో ధోని చిన్నతనం నుంచి క్రికెటర్‌గా మారే వరకు తాను ఎదుర్కొన్న కష్టాలు, తన జర్నీ గురించి ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
6. అజహర్ (2016)
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, హైదరాబాదీ ప్లేయర్ మహమ్మద్ అజారుద్దీన్ బయోపిక్‌గా అజహర్ మూవీ రూపొందింది. ఇందులో అజారుద్దీన్ క్రికెట్ కెరీర్, మ్యాచ్ ఫిక్సింగ్ కాంట్రవర్సీ, అందులో నుంచి బయట పడటానికి ఆయన చేసిన పోరాటం గురించి చూపిస్తారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
7. సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్ (2017)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ బయోపిక్‌గా తెరకెక్కిన ఇన్స్పిరేషనల్ మూవీ 'సచిన్ : ఎ బిలియన్ డ్రీమ్స్'. ఇందులో సచిన్ క్రికెట్ జర్నీ గురించి ఓ డాక్యుమెంటరీ రూపంలో చూపించారు. ఇది మారాఠి, హిందీ, ఇంగ్లీష్‌లో ఒకేసారి రూపొందింది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళంలో దీన్ని డబ్ చేశారు.
8. కౌన్ ప్రవీణ్ తాంబే? (2020)
41 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ప్రవీణ్ తాంబే జీవిత కథ ఆధారంగా తీశారు ఈ సినిమా. క్రికెట్ ఆడాలకునుకున్న ప్రవీణ్ తన లైఫ్‌లో ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఆఖరికి తన కలను నెరవేర్చుకుంటాడు.
9. 83 (2021)
ఇండియాకు మొట్ట మొదటి ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఇందులో ప్రధానంగా కపిల్ జీవిత చరిత్రతో పాటు 1983 ప్రపంచ కప్ విజయం, దాని వెనక ఉన్న ప్లేయర్ల కృషిని ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు చూపిస్తారు.
10. జెర్సీ (2022)
కుటుంబ ఇబ్బందుల కారణంగా క్రికెట్ వదిలిపెట్టిన ఓ వ్యక్తి కొడుకు కోరిక మేరకు టీమ్ఇండియా జెర్సీని ధరించాలని మళ్లీ బ్యాట్ పట్టిన స్టోరీ ఇది. ఈ సినిమా లైఫ్‌లో కొన్ని సార్లు సెకండ్ ఛాన్సెస్ అనేవి ఎలాంటి రోల్ ప్లే చేస్తాయన్న విషయాన్ని చూపిస్తారు మేకర్స్. తెలుగులో హీరో నాని లీడ్ రోల్లో తెరకెక్కిన ఈ మూవీ సూపర్‌హిట్ టాక్ అందుకుంది. ఇక ఇదే స్టోరీని హిందీలోనూ రీమేక్ చేశారు. అందులో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ మెయిన్ రోల్ పోషించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బాలీవుడ్లో స్పోర్ట్స్ బయోపిక్స్‌కు సూపర్ క్రేజ్.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షమే!
క్రికెటర్లుగా మారిన సినీ తారలు.. మరి గ్రౌండ్లో దుమ్మురేపుతారా!?