ETV Bharat / entertainment

టాలీవుడ్ అప్​కమింగ్ బడా ప్రాజెక్ట్స్​ - ​ఈ స్టార్​ హీరోల సరసన సొగసరి వీరేనా? - Tollywood Upcoming Movies Heroines

author img

By ETV Bharat Telugu Team

Published : 23 hours ago

Tollywood Upcoming Movies Heroines : తెలుగులో పలువురు స్టార్‌ హీరోలు తమ కొత్త సినిమాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కథలు, డైరెక్టర్లు కుదిరినా సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా సందిగ్ధంలోనే ఉంది. ప్రచారంలో పలువురు భామల పేర్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ వారు ఎవరు? ఆ సినిమా వివరాలేంటో తెలుసుకుందాం.

source ETV Bharat
Tollywood Heroes (source ETV Bharat)

Tollywood Upcoming Movies Heroines : స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ల ఎంపికనేది ఎప్పుడూ కత్తి మీద సాము లాంటిదే. పాన్‌ ఇండియా ట్రెండ్‌ ఎక్కువయ్యాక ఇది మరింత కష్టంగా మారింది. కొత్తదనం కనిపించడంతో పాటు హీరోకు తగిన జోడీ అనిపించుకోవాలి. అలానే ఆమె సక్సెస్​ ట్రాక్​తో పాటు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే గ్లామర్‌ ఉందో లేదో చూసుకోవాలి. అందుకే బడా కథానాయికల చిత్రాలలోకి హీరోయిన్​ను వెతికి పట్టుకోవడం అంత ఈజీగా కుదరడం లేదు.

NTR 31 Movie Heroine : ఎన్టీఆర్‌ 31 - ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో ఓ సినిమా రానుంది. కేజీఎఫ్‌ సిరీస్​, సలార్‌ వంటి భారీ విజయాల తర్వాత ప్రశాంత్‌ నుంచి రానున్న చిత్రమిది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. అక్టోబరు నెలాఖరు నుంచి సెట్స్‌పైకి వెళ్లనుందని తెలిసింది. తారక్‌ జనవరి నుంచి సెట్స్​లోకి అడుగుపెడతారు. మరి ఈ చిత్రంలో తారక్​కు జోడీగా ఎవరు కనిపిస్తారనేది క్లారిటీ లేదు. ఇప్పటికైతే రష్మికతో పాటు పలువురు బాలీవుడ్‌ భామల పేర్లు వినిపిస్తున్నాయి. తారక్‌ సెట్​లోకి అడుగుపెట్టేనాటికి హీరోయిన్​ను ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.

HIT 3 Movie Heroine : రీసెంట్​గా 'సరిపోదా శనివారం'తో మంచి విజయాన్ని అందుకున్న నాని ప్రస్తుతం హిట్‌ 3తో పాటు దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెలతో ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికే హిట్‌ 3 షూటింగ్ ప్రారంభించగా శ్రీకాంత్‌ ఓదెలతో మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. కానీ ఈ చిత్రాల్లో హీరోయిన్​ ఎవరన్నది స్పష్టత రాలేదు. నాని - శ్రీకాంత్‌ కాంబో సినిమా కోసం జాన్వీ కపూర్‌ను తీసుకోనున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ, బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని మీడియం రేంజ్‌ హీరోయిన్​ కోసం కొత్త వేట మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక హిట్‌ 3 కోసం నివేదా థామస్‌తో పాటు మరికొందరి పేర్లు పరిశీలిస్తున్నారట.

Ram Pothineni and Mahesh Babu film : మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమా ఆడియెన్స్​ను ఆకట్టుకున్న దర్శకుడు మహేశ్‌బాబు ఇప్పుడు హీరో రామ్‌తో ఓ సినిమా చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్​లో రానున్న ఈ సినిమాలో నటించేందుకు హీరోయిన్​ వేట కొనసాగుతోంది. సినిమాలో ఓ సీనియర్‌ హీరో కూడా కనిపించే అవకాశమున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రామ్ విదేశాల్లో ఉన్నారు. ఆయన తిరిగి రాగానే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నారట.

SSMB 29 Heroine : రాజమౌళి - మహేశ్‌ బాబు కాంబో SSMB 29 భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయిలో ముస్తాబవుతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ చిత్రంలోనూ హీరోయిన్ ఎవరనేది క్లారిటీ లేదు. అయితే ఓ విదేశీ భామను తీసుకోబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇండోనేషియా తార చెల్సియా ఎలిజబెత్‌తో పాటు మరో ఇద్దరు విదేశీ హీరోయిన్ల పేర్లు వినిపించాయి.

Prabhas Hanu Raghavapudi Heroine : ప్రభాస్‌ - హను రాఘవపూడి ఫౌజీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. షూటింగ్‌ ప్రస్తుతం మధురై పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. మూవీలో ఇద్దరు నాయికలకు అవకాశమున్నట్లు సమాచారం. వాటిలో ఓ పాత్ర కోసం కొత్తమ్మాయి ఇమాన్విని ఇప్పటికే ఖరారు చేశారు. అయితే ఆ రెండో నాయికగా ఎవరు కనిపిస్తారన్నది ఇంకా తేలలేదు.

రజనీ, అమితాబ్​లో అది కామన్ పాయింట్ : 'వేట్టాయాన్​' బ్యూటీ మంజు వారియర్ - Manju Warrier Vettaiyan

వోకల్ సర్జరీ జరిగిన వెంటనే పాట - 15 నిమిషాల్లో నేర్చుకుని 10 నిమిషాల్లో పాడి! - SPB Death Anniversary

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.