ETV Bharat / entertainment

మంచు మనోజ్ ఈజ్ బ్యాక్- 'మిరాయ్' వైలెంట్ గ్లింప్స్ ఔట్ - Manchu Manoj Mirai

author img

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 12:43 PM IST

Updated : May 20, 2024, 2:14 PM IST

Manchu Manoj Mirai: రాకింగ్ స్టార్ మంచు మనోజ్, తేజ సజ్జ కీ రోల్స్​లో తెరకెక్కుతున్న సినిమా 'మిరాయ్'. కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. సోమవారం మనోజ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయన పాత్రకు సంబంధించిన వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Manchu Manoj Mirai
Manchu Manoj Mirai (Source: ETV Bharat)

Manchu Manoj Mirai: టాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్ కాస్త గ్యాప్ తర్వాత 'మిరాజ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. కాగా, 'హను-మాన్' ఫేమ్ హీరో తేజ సజ్జ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా, మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. హీరో మనోజ్ బర్త్​డే సందర్భంగా మేకర్స్​ ఈ సినిమా నుంచి సోమవారం గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మనోజ్ కత్తి పట్టిన ఓ యోధుడిలా కనిపించినున్నట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. ఇక ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సినిమా 2025 ఏప్రిల్ 25న థియేటర్లలోకి రానున్నట్లు అనౌన్స్​ చేశారు.

'దిస్ ఈజ్ ఎబౌడ్ బ్లాక్ స్వోర్డ్' అంటూ గ్లింప్స్ ప్రారంభమైంది. రక్తపు మడుగుల్లో పని ఉన్న కొన్ని మృతదేహాలను చూపించారు. అయితే ఈ బ్లాక్ స్వోర్డ్ అనేది ప్రపంచంలోనే ప్రమాదకరమైందని చెబుతూ యాక్షన్ సీన్స్​తో మనోజ్​ను బాగా ఎలివేట్ చేశారు. పెద్ద జుట్టుతో, బ్లాక్ సూట్​లో ఉన్న మనోజ్ ప్రత్యర్థులపై విచక్షణారహితంగా దాడి చేశారు. అయితే ఈ గ్లింప్స్ చూశాక సినిమాలో మనోజ్​ది నెగిటివ్ రోల్ అని అభిప్రాయపడుతున్నారు. కానీ, ఈ సినిమాలో మనోజ్ రోల్​పై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ మూవీని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతోపాటు కొరియన్​ భాషల్లో తెరకెక్కుతోంది.

Manchu Manoj Ustaad Talk Show: అయితే 2017 నుంచి సినిమాలకు దూరమైన మనోజ్ గతేడాది 'ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం' అనే గేమ్ షోతో ప్రేక్షకులను పలకరించారు. ఈటీవీ విన్ (ETV Win)లో ప్రసారం అయ్యే ఈ షోకు మనోజ్ హోస్ట్​గా వ్యవహరిస్తున్నారు. ఈ గేమ్​ షో పలు సీజన్​ల వారిగా ప్రసారం చేస్తున్నారు.

ఇక మిరాయ్ విషయానికొస్తే, ఈ సినిమాను దాదాపు రూ.60 బడ్జెడ్​తో తెరకెక్కిస్తున్నారు. హీరో తేజ సజ్జ 'సూపర్ యోధ' పాత్ర పోషించనున్నారు. మనోజ్​తోపాటు రితికా నాయక్, శ్రీరామ్ రెడ్డి, తాంజ తదితరులు ఆయా పాత్రల్లో నటిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మంచు వారింటికి కొత్త వారసురాలు - పండంటి పాపకు జన్మనిచ్చిన మంచు మనోజ్ భార్య - Manchu Manoj Daughter

గుడ్​ న్యూస్​ చెప్పిన మంచు మనోజ్​ - త్వరలో తండ్రి కాబోతున్నంటూ ట్వీట్

Last Updated : May 20, 2024, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.