ETV Bharat / entertainment

చరణ్​, చైతూ, వరుణ్- వీరి ఫోకస్​ అంతా ఉత్తరాంధ్రపైనే! - ఉత్తరాంధ్ర యాసలో తెలుగు సినిమాలు

Tollywood Movies Based On Uttarandhra : తెలుగు భాష ఒక్కటే అయినా ప్రాంతాన్ని బట్టి అది కొత్త యాసతో సరికొత్తగా అనిపిస్తుంది. కోనసీమ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఇలా ఆయా యాస భిన్నమైన రుచుల్ని పంచుతుంటుంది. అందుకే కథలు సిద్ధం చేసుకునే సమయంలోనే దాన్ని ఏ ప్రాంత నేపథ్యం నుంచి చెప్పాలన్న విషయాన్ని కూడా ఆలోచిస్తుంటారు డైరెక్టర్లు. ఇప్పుడిలా సిద్ధమైన వాటిలో ఉత్తరాంధ్ర నేపథ్యంతో పలు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు వస్తున్నాయి. అవేంటంటే ?

Tollywood Movies Based On Uttarandhra
Tollywood Movies Based On Uttarandhra
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 9:32 AM IST

Updated : Feb 18, 2024, 9:55 AM IST

Tollywood Movies Based On Uttarandhra : ఒకప్పుడు రాయలసీమ నేపథ్యంగా సాగే యాక్షన్‌ సినిమాలు తెలుగు తెరపై సందడి చేశాయి. ఈ మధ్యలో కొన్ని తెలంగాణ నేపథ్య కథల కూడా ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు ఉత్తరాంధ్ర కథల వంతైంది . ఈ యాస్​, ఈ బ్యాక్​డ్రాప్​లో సినిమాలను తెరకెక్కించేందుకు డైరెక్టర్లు ఆస్తక్తి చూపిస్తున్నారు. అక్కడి అందాలను, అక్కడి అలవాట్లను ఆడియెన్స్​ను చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్​లో సందడి చేయనున్న ఉత్తరాంధ్ర సినిమాలేంటో ఓ లుక్కేద్దామా.

ఎమోషనల్ జర్నీలో చెర్రీ
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ లీడ్ రోల్​లో ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన డైరెక్షన్​లో ఓ సినిమా తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ వెంకట సతీష్‌ కిలారు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ మూవీ కూడా పూర్తిగా ఉత్తరాంధ్ర నేపథ్యంలోనే సాగనుందని సమచారం. ఓ ఆటను ప్రధానంగా చేసుకొని బలమైన భావోద్వేగాలతో నిండిన సినిమాగా దీన్ని తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా కోసం ఉత్తరాంధ్ర యాసను అనర్గళంగా మాట్లాడగల కొత్త నటీనటులను కూడా ఆడిషన్​ చేస్తున్నారు. చెర్రీ కూడా ఉత్తరాంధ్ర యాస నేర్చుకుంటున్నారట. సమ్మర్​లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట.

బుజ్జి కోసం 'తండేల్​'
నాగచైతన్య లీడ్​ రోల్​లో రానున్న 'తండేల్‌' సినిమా కూడా ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కనుంది. పాకిస్థాన్‌ తీర సైన్యానికి అనుకోకుండా పట్టుబడిన ఓ జాలరి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపందుతోంది. ఇటీవలే వచ్చిన గ్లింప్స్​లో చైతూ ఈ యాసలో మాట్లాడి ఆడియెన్స్​ను ఆకట్టుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పీరియాడిక్ డ్రామా - వరుణ్​ నాలుగు గెటప్స్
మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, మానుషి చిల్లర్​ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మట్కా. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తిగా ఉత్తరాంధ్ర నేపథ్యంలోనే సాగనుంది. 1958-80ల మధ్య కాలంలో సాగే ఈ సినిమాలో వరుణ్‌ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు.

'వేదం' కాంబో రిపీట్
అనుష్క - క్రిష్‌ జాగర్లమూడి డైరెక్షన్​లో తెరకెక్కనున్న సినిమా కూడా ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగనుందని సమాచారం. తనకు జరిగిన అన్యాయంపై ఓ అమ్మాయి ఎలా పోరాటం చేసిందన్నదన్నదే ఈ మూవీ స్టోరీ.

'తండేల్' రిలీజ్​పై డైరెక్టర్ క్లూ- ఆ స్టార్లతో బాక్సాఫీస్ పోటీకి సై!

'తండేల్'​ టు 'తంగలాన్' ​- టైటిల్స్​లో కొత్త ట్రెండ్​ - వీటికి అర్థాలు తెలుసా ?

Last Updated : Feb 18, 2024, 9:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.