ETV Bharat / entertainment

హార్ట్​ బ్రేక్​ ఎమోజీతో సమంత ఎమోషనల్​ పోస్ట్​- ఓదారుస్తున్న నెటిజన్స్! - samantha on vinesh phogat - SAMANTHA ON VINESH PHOGAT

samantha on vinesh phogat : పారిస్ ఒలింపిక్స్​లో ఫైనల్​కు చేరి స్వర్ణాన్ని చేజార్చుకున్న ప్రముఖ రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​.. సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. తాజాగా టాలీవుడ్​ హీరోయిన్ సమంత కూడా ఆమెకు ధైర్యానిస్తూ పోస్ట్ చేసింది.

samantha on vinesh phogat
హార్ట్​ బ్రేక్​ ఎమోజీతో సమంత ఎమోషనల్​ పోస్ట్​ (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 8, 2024, 7:38 PM IST

Samantha On Vinesh Phogat : భారత ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పారిస్ ఒలింపిక్స్​లో త్రుటిలో బంగారు పతకాన్ని పోగొట్టుకుంది. ఫైనల్‌ బౌట్‌కు కొన్ని గంటల ముందు అధిక బరువు కారణంగా వినేశ్ ఫొగాట్‌ను అనర్హురాలిగా ప్రకటించింది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఫొగాట్​.. కొద్ది గంటల్లోనే రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు మద్దతుగా భారతీయులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రాజకీయాల నుంచి సినీ, క్రీడా ప్రముఖుల వరకు అందరూ ఆమెకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్​ హీరోయిన్​ సమంత ఆమెకు ధైర్యం చెబుతూ పోస్ట్​ చేయగా.. వైరల్​గా మారింది.

'మీరు మరింత శక్తితో మళ్లీ తిరిగొస్తారు'
"కొన్నిసార్లు పోరాడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు చాలా కష్టతరమైన ఆటంకాలను ఎదుర్కొంటారు. కానీ అప్పుడు మీరు ఒంటరిగా లేరనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు మరింత శక్తితో మళ్లీ తిరిగొస్తారు. మీ అద్భుతమైన సామర్థ్యంతో ఎన్నో కష్టాలను దాటుకుంటూ ఇలా నిలదొక్కుకోవడం నిజంగా కొనియాడదగినది.' అని సమంత ఇన్​స్టాగ్రామ్​లో రాసుకొచ్చింది. అంతకుముందు వినేశ్​ ఫొగాట్​ రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసి సమంత ఆవేదన వ్యక్తం చేసింది. హర్ట్‌ బ్రేక్‌ సింబల్‌తో ఆమె రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయాన్ని ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం సమంత పెట్టిన ఈ పోస్ట్‌ కూడా నెట్టింట వైరల్‌గా మారింది. అంతకుముందు రెజ్లింగ్​కు రిటైర్మెంట్​ ప్రకటించిన వినేశ్​ ఫొగాట్​.. ఎక్స్​లో పోస్ట్ చేసింది. "తల్లిలాంటి కుస్తీ నా మీద విజయం సాధించింది. నేను అందులో ఓడిపోయాను. నన్ను క్షమించండి.. మీ కల, నా ధైర్యం విచ్ఛిన్నమయ్యాయి. ఇక నాకు పోరాడే బలం లేదు. మీ అందరికి ఎప్పటికీ రుణపడి ఉంటా" అని చెప్పింది.

సిల్వర్​ దక్కేనా!
పారిస్‌ ఒలింపిక్స్‌లో ఫైనల్‌ చేరి అదనపు బరువుతో అనూహ్యంగా అనర్హతకు గురైన వినేశ్‌.. తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ కోర్ట్‌ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది. తాను సిల్వర్‌ మెడల్‌కు అర్హురాలినని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆర్బిట్రేషన్‌ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇంతలోనే రెజ్లింగ్​కు రిటైర్మెంట్​ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

8.8.8 నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థ ముహూర్తం స్పెషల్ ఏంటో తెలుసా? - Naga Chaitanya Sobhita Dhulipala

ఇట్స్​ అఫీషియల్- నాగచైతన్య, శోభిత పెళ్లి కన్ఫామ్​ చేసిన నాగార్జున - Shobita Naga Chaitanya Engagement

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.