Tollywood Heroes Upcoming Movies : పాన్ ఇండియా ట్రెండ్ వచ్చాక ఒకొక్క సినిమా కోసం ఆయా హీరోలు సుదీర్ఘ కాలం ప్రయాణం చేయాల్సి వస్తోంది. గతంలో ఏడాదికి ఒకట్రెండు సినిమాలను పూర్తి చేస్తే ఇప్పుడు ఒక్కో సినిమాకే కనీసం రెండు మూడేళ్లు తీసుకుంటున్నారు. షూటింగ్, కాస్టింగ్, ప్రీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ సహా ఇతర కారణాలతో ఆలస్యం కావడం వల్ల రిలీజ్ డేట్లు కూడా పదే పదే మారిపోతున్నాయి. అయితే ఇప్పుడు కొంతమంది హీరోలు చేస్తున్న చేస్తున్న చిత్రాల షూటింగ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. ప్రభాస్ కల్కి 2898 ఎ.డి, రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్, ఎన్టీఆర్ దేవర, అల్లు అర్జున్ పుష్ప 2, రామ్ డబుల్ ఇస్మార్ట్ ఇలా చాలా సినిమాలు చివరి దశకు వచ్చాయి. ఇవి పూర్తికాగానే ఈ కథానాయకులంతా కూడా తమ కొత్త సినిమాల కోసం సిద్ధం కానున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రభాస్ కల్కి 2898 ఎ.డి పూర్తి కాగానే త్వరలోనే ది రాజాసాబ్, సలార్ 2 సినిమాలను పూర్తి చేయనున్నారు. పవన్‌కల్యాణ్ ఓజీ సెప్టెంబరు 27న రిలీజ్ కానుంది. దీని తర్వాత ఉస్తాద్ భగత్‌సింగ్ కంప్లీట్ చేయనున్నారు. రామ్‌చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్‌ల కొత్త కథల చర్చల దశలో ఉన్నారు. రామ్‌చరణ్ గేమ్‌ఛేంజర్ అవ్వగానే బుచ్చిబాబు సానాతో ఆర్సీ 16 చేయనున్నారు. రీసెంట్గా సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. వచ్చే ఏడాది వేసవికి ఇది రిలీజ్ కావొచ్చు. ఎన్టీఆర్ దేవర పూర్తి చేయనున్నారు. దీని తర్వాత వార్ 2 కోసం రంగంలోకి దిగనున్నారు.
అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రీకరణను మే నెలాఖరులోపు పూర్తి చేయనున్నారు. ఆగస్టు 15న సినిమా రిలీజ్ కానుంది. దీని తర్వాత అట్లీతో చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో కూడా చేయనున్నారు. మహేశ్‌బాబు ఇప్పటికే రాజమౌళి మూవీ కోసం సన్నద్ధమవుతున్నారు. మరో రెండు మూడేళ్లు ఈ చిత్రంతోనే జర్నీ చేయనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇక రామ్, నాగచైతన్యతో పాటు ఇతర హీరోలు కూడా సెట్స్‌పై ఉన్న చిత్రాన్ని పూర్తి చేసి కొత్త సినిమాల కోసం రెడీ అవుతున్నారు. నాగచైతన్య తండేల్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. నెక్ట్స్ కార్తీక్ దండుతో చేసే అవకాశం ఉంది. రామ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ దాదాపుగా పూర్తైపోయింది. నాని సరిపోదా శనివారం కూడా ఆగస్టు 29న రిలీజ్ కానుంది. తర్వాత ఆయన దసరా దర్శకుడితో మరోసారి పనిచేయనున్నారు. ఫ్యామిలీస్టార్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ దేవరకొండ నెక్ట్స్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. అలా ఈ వేసవి తర్వాత హీరోల కొత్త సినిమాల చిత్రీకరణలతో ఇండస్ట్రీ కోలాహలంగా కనిపించనుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వీకెండ్ స్పెషల్ 25 సినిమా/సిరీస్‌లు - మీ ఛాయిస్ ఏంటి? - This Week OTT ReleasesPostponed