ETV Bharat / entertainment

టాలీవుడ్ స్టార్లు పాడిన పాటలు- అన్నీ సూపర్ హిట్టే! - Tollywood Actors Vocals - TOLLYWOOD ACTORS VOCALS

Tollywood Actors Vocals: తమ సినిమాల్లో పాటల కోసం సింగర్స్ గా మారిన ఈ టాలీవుడ్ నటీనటులు ఎవరు? ఆ సూపర్ హిట్ పాటలు ఏంటో తెలుసుకుందామా?

Tollywood Actors Vocals
Tollywood Actors Vocals
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 22, 2024, 6:49 PM IST

Tollywood Actors Vocals: టాలీవుడ్​లో అనేక మంది స్టార్ హీరోలు తమ లక్షలాది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆయా సినిమాల్లో వారి పాత్రలకు ఫ్యాన్స్​ను ఫిదా చేస్తుంటారు. అలా తమ నటనతో ఆడియెన్స్​ను స్క్రీన్​కు కట్టిపడేస్తారు. అయితే అలా నటనతో అదరగొట్టడమే కాకుండా పలువురు హీరోలు తమ గొంతు స్వరాలనూ వినిపించారు. అలా తమ సినిమాల్లో పాడిన పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. మరి సింగర్​గా మారిన హీరోలెవరు? అవి ఏ పాటలు? తెలుసుకుందాం.

  • పవన్ కల్యాణ్- కాటంరాయుడు: 'కాటమ రాయుడా! కదిరి నరసింహుడా!' అంటూ 2013లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్ పాడిన ఆ పాట సినిమా రిలీజ్ కాకముందే సూపర్ హిట్ అయింది.
  • జూనియర్ ఎన్టీఆర్- ఫాలో ఫాలో: ఎన్టీఆర్ అప్పటికే యమదొంగలో 'ఓలమ్మి తిక్క రేగిందా' అనే పాటతో పాటు కంత్రిలో '123 నేనే కంత్రి' అనే పాటను పాడారు. కానీ 'నాన్నకు ప్రేమతో' సినిమాలో పాడిన 'ఫాలో ఫాలో' మాత్రం సూపర్ హిట్ సింగర్​ని చేయడమే కాదు మిర్చి మ్యూజిక్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది.
  • రవితేజ- నోటంకి: పవర్ సినిమాలో 'నాటంకి' అనే పాట ద్వారా మంచి సింగర్ అనిపించుకున్నారు రవితేజ. అంతకు ముందు ఏడాది వచ్చిన బలుపు సినిమాలో 'కాజల్ చెల్లివా' అనే పాటతో సింగర్​గా మారారు. ఆ తర్వాత రాజా ది గ్రేట్ సినిమాలో టైటిల్ సాంగ్ కూడా తనే పాడారు.
  • వెంకటేష్- జింగిడి: విక్టరీ వెంకటేష్ కూడా గురు సినిమాలో 'జింగిడి' పాట ద్వారా సింగర్ అయిపోయారు.
  • నాగార్జున- కొత్త కొత్త భాష: 2016లో వచ్చిన నిర్మల కాన్వెంట్ సినిమాలో 'కొత్త కొత్త భాష' పాటతో నాగార్జున కూడా సింగర్ గా మారారు.
  • చిరంజీవి- చాయ్: మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడో 2001లో వచ్చిన మృగరాజు సినిమాలో 'చాయ్' పాటతో సింగర్​గా మంచి గుర్తింపు వచ్చింది. అయితే అంతకుముందే 'మాస్టార్' సినిమాలో 'తమ్ముడు అరే తమ్ముడు' పాటతో సింగర్​గా మారారు.
  • బాలకృష్ణ- మామా ఏక్ పెగ్ లా: పూరీ జగన్నాధ్ తన సినిమా 'పైసా వసూల్' తో బాలకృష్ణని సింగర్​గా మార్చారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఈ పాట మాత్రం బాలకృష్ణ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.
  • సిద్దార్థ్- అప్పుడో ఇప్పుడో: సిద్దార్థ్​ చుక్కల్లో చంద్రుడు సినిమాతో సింగర్​గా మారినా బొమ్మరిల్లు సినిమాలో పాడిన 'అప్పుడో ఇప్పుడో' పాటతో పాటు ఓయ్​లో 'ఓయ్' పాట కూడా మంచి పేరు తెచ్చింది.
  • రాశీ ఖన్నా- జోరు: హీరోలే కాదు హీరోయిన్లు కూడా సింగర్ గా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రాశీ ఖన్నా జోరు సినిమాలో 'జోరు' పాట ద్వారా సింగర్​గా మారింది. అయితే జవాన్ సినిమాలో పాడిన 'బంగారు' పాట రాశికి మంచి పేరు తీసుకువచ్చింది.
  • లక్ష్మీ మంచు- ఏందిరో: లక్ష్మీ మంచు నటించి నిర్మించిన 2015లో వచ్చిన దొంగాట సినిమాలో 'ఏందిరో' అని పాడిన పాట అప్పట్లో మంచి హిట్ అయింది.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

తెలుగులోనూ హర్రర్ సినిమాల జోరు- టాప్ 10 మూవీస్ లిస్ట్ ఇదే- మీరేం చూస్తారు? - Telugu Top 10 Horror Movies OTT

అక్షయ్ కుమార్ ఐపీఎల్ పెర్ఫామెన్స్​ - ఒక్క డ్యాన్స్​కు రూ. 2.5 కోట్లు! - Akshay Kumar IPL Remuneration

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.