Titanic, Lord of the Rings Actor Bernard Hill Died : టైటానిక్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లాంటి హిట్ సినిమాల్లో ప్రముఖ పాత్రలు పోషించి ప్రేక్షకుల్లో బాగా గుర్తింపు పొందిన నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూశారు. వృద్ధ్యాప్య సమస్యల కారణంగా ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించినట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో ఆయన అభిమానులు, ఇతర సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
"బెర్నార్డ్ మరణ వార్త విని ఎంతో బాధేసింది. ఆయనతో కలిసి నటించడం అద్భుతం. ఆయన నిజంగా మార్వెలెస్ యాక్టర్(అద్భుతమైన నటుడు). ఆయన ఆత్మకు శాంతి కలగలాని ప్రార్థిస్తున్నాము" అంటూ అందరూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.
Actor Bernard Hill Movies : 79 ఏళ్ల వయస్సున్న బెర్నార్డ్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్, ట్రయాలజీ, ద టూ టవర్స్, రిటర్న్ ఆఫ్ ది కింగ్ సినిమాల్లో కనబరిచిన అద్భుతమైన నటనకు 11 ఆస్కార్లు అందుకున్నారు. అయితే ఈ సినిమాలన్నింటి కన్నా ముందే ఆయన టైటానిక్‌తో మంచి పేరు సంపాదించుకున్నారు.
1912లో జరిగిన యథార్థ సంఘటనకు ప్రేమకథను జోడించి సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగేలా టైటానిక్ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఈ సినిమాలో కెప్టెన్‌గా హుందాతనమైన క్యారెక్టర్ పోషించారు బెర్నార్జ్. 'ప్రయాణికులను కాపాడలేని కెప్టెన్ ప్రాణాలతో బయటపడినా చనిపోయినట్లేనని' అంటూ ట్రావెలర్స్‌ను కాపాడే పాత్రలో అద్భుతంగా నటించారాయన.
ఈ సినిమాలకే పరిమితం కాలేదు. సినిమా ఆర్టిస్ట్‌గానే కాకుండా టీవీ ఆర్టిస్ట్‌గా, స్టేజ్ ఆర్టిస్ట్‌గా సేవలందించి నటనకు ప్రాణం పోశారు. యూకేకు చెందిన బెర్నార్డ్ ఐదు దశాబ్దాలుగా ఇదే రంగంలో కొనసాగారు. అయితే కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం కనుమూశారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో హాలీవుడ్ సినీ లోకం శోక సంద్రంలో మునిగిపోయింది.
ఒకేసారి రెండు కొత్త సినిమాలు సెట్స్‌పైకి - Prabhas LineUp Movies
ఆ నవ్వు చూశారా ఇక అంతే! - ఓటీటీలో భయపెడుతున్న హారర్ థ్రిల్లర్ మూవీ - OTT Horror Film