Tinnu Anand Salaar Movie : రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'సలార్'. పాన్ ఇండియా లెవెల్లో రూపొందిన ఈ చిత్రం ఇటు ఇండియాతో పాటు అటు ఓవర్సీస్లోనూ సంచలనాలు సృష్టించింది. ఇటీవలే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోనూ స్ట్రీమింగ్కు వచ్చి అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ నటుడు టీనూ ఆనంద్ ఓ ఇంటర్వ్యూలో సలార్ సినిమా గురంచి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. అంతే కాకుండా హీరో ప్రభాస్‌పై ప్రశంసల జల్లును కురిపించారు.
" ఒక రోజు నేను, ప్రభాస్, పృథ్వీరాజ్, ఆయన సతీమణి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కలిసి 'సలార్' సెట్స్‌లో ల్యాప్‌టాప్‌లో టీజర్ చూశాం. అందులో తన పాత్రకు నేను ఇచ్చిన ఎలివేషన్‌కు ప్రభాస్ ఫిదా అయ్యారు. వెంటనే నా దగ్గరకు వచ్చి ఆయన హగ్ చేసుకున్నారు. టీజర్ మొత్తంలో ఒకే ఒక షాట్ తనది. అయినప్పటికీ 'టీనూ సర్ అదిరిపోయింది' అంటూ నన్ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇలా మనం చేసిన పనిని ఎవరైనా నలుగురిలో ప్రశంసిస్తే మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మరి, స్టార్ హీరో ప్రభాస్ పొగిడితే ఎలా ఉంటుంది? మరోవైపు, టీజర్ చూసిన వెంటనే 'ప్రశాంత్ ఇప్పుడే దీన్ని రిలీజ్ చేయండి' అంటూ పృథ్వీరాజ్ సతీమణి అన్నారు. అలా సెట్స్‌లో ఉన్న ఇతరులు కూడా నన్ను అభినందించారు. అప్పుడు నేను పొందిన అనుభూతిని బాలీవుడ్‌లో ఎప్పుడూ పొందలేదు" అంటూ సలార్ సెట్స్‌తో తన అనుభూతులను పంచుకున్నారు.
Salaar Movie Cast : ఇక సలార్ సినిమాలో ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతిబాబు, బాబీ సింహా, టినూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రియారెడ్డి కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ సూపర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ మూవీ లవర్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. హొంబాలే మీడియా సంస్థ తెరకెక్కించిన ఈ సినిమాకు విజయ్ కిరంగదూర్ నిర్మాతగా వ్యవహరించారు. పార్ట్-1 సీజ్ ఫైర్‌గా విడుదలైన ఈ సినిమాకు శౌర్యంగ పర్వం అనే సీక్వెల్‌ను రెడీ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">