Tillu Square Collections : టిల్లు బాయ్ సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమాకు రెండో రోజు కూడా బాక్సాఫీస్ ముందు భారీ స్పందన వచ్చింది. వసూళ్లు కూడా అదిరిపోయాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. రెండో రోజు మార్నింగ్ ఆక్యూపెన్సీ 43.99 శాతం, మధ్యాహ్నం ఆక్యూపెన్సీ 64.40 శాతం, ఈవెనింగ్ ఆక్యూపెన్సీ 64.85 శాతం, నైట్ ఆక్యూపెన్సీ 78.71శాతం ఉన్నట్లు తెలిసింది.
ఫలితంగా సిద్ధు జొన్నలగడ్డ కెరీర్లోనే అత్యధికంగా వసూళ్లు వచ్చాయట. ఈ సినిమాకు తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.23.7 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలిపిన మూవీటీమ్ రెండో రోజు కూడా ఎంత కలెక్షన్స్ వచ్చాయో తెలిపింది. రెండు రోజుల్లో రూ.45.3 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు పేర్కొంది. టిల్లన్న బాక్సాఫీస్ ర్యాంపేజ్ కొనసాగుతోంది. మా స్టార్ బాయ్ రికార్డ్లన్నింటినీ బ్రేక్ చేస్తాడు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఓ స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేసి అభిమానుల్లో మరింత హైప్ పెంచింది. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా టిల్లు గాడి హవానే నడుస్తోంది.
Siddu Jonnalagadda Anupama Parameswaran Movie : ఇకపోతే సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ తెరకెక్కించారు. అనుపమ హీరోయిన్‌గా నటించింది. ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, తమన్ సంగీతం అందించారు. ఫస్ట్ పార్ట్ హీరోయిన్ నేహా శెట్టి గెస్ట్ రోల్లో కనిపించింది. ప్రిన్స్, మురళిధర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
Tillu Square Review And Rating : సినిమా రివ్యూ విషయానికొస్తే టిల్లు పాత్రలో సిద్ధు అల్లరి యూత్ ఆడియెన్స్‌ను విపరీతంగా కనెక్ట్ అయింది. అనుపమ అందచందాలు, కథలోని వినోదం, కొన్ని ట్విస్ట్‌లు చిత్రానికి ప్లస్‌గా నిలిచాయి. అయితే కథ మాత్రం రొటీనే అని అంటున్నారు. కానీ ఫైనల్‌గా అట్లుంటది టిల్లుతోని అంటూ డబుల్ ఎంటర్‌టైనర్ పంచాడు టిల్లు స్క్వేర్ అని అభిప్రాయపడుతున్నారు.
టిల్లు స్క్వేర్ కుమ్మేశాడు భయ్యా - డే 1 ఎన్ని కోట్లంటే? - Tillu Square Day 2 Collections