Tiger Shroff Remuneration : బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాప్ ఖాతాలో గతకొంత కాలంగా ఒక్క హిట్ కూడా పడలేదు. ఇటీవలె ఆయన 'బడే మియాన్ చోటే మియాన్' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించగా, అది కూడా ఆడియెన్స్‌ను నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు ఈ స్టార్ హీరో కెరీర్ చిక్కుల్లో పడింది. అంతకుముందు ఆయన నటించిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్‌తో సరిరపెట్టుకుంది. దీంతో ప్రస్తుతం ఆయన చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.
అయితే తాజాగా టైగర్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. పలువురు మేకర్స్ ఆయన రెమ్యూనరేషన్‌ను 70 శాతం మేర తగ్గించుకోవాలని సూచించారట. 'బడేమియాన్ చోటే మియాన్' సినిమాకుగానూ ఆయన రూ. 30 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నారట. ఆ లెక్కన రానున్న సినిమాలకు గానూ ఆయన దాదాపు రూ. 9 కోట్లు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇది విన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. టైగర్‌కు సపోర్ట్ చేస్తున్నారు. త్వరగా కమ్‌బ్యాక్ ఇచ్చి మళ్లీ ఫామ్‌లోకి రావాలని కోరుకుంటున్నారు.
ఇక బడేమియా చోటే మియా సినిమా విషయానికి వస్తే - బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏప్రిల్ 9న గ్రాండ్‌గా విడుదలైంది. ఇందులో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, 'సలార్' ఫేమ్ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు.
వీరితో పాటు మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా, అలయా ఎఫ్, రోనిత్ బోస్ రాయ్, సునీల్ శెట్టిలు లాంటి స్టార్స్ కూడా ఇంపార్టెంట్ రోల్స్‌లో కనిపించారు. విశాల్ మిశ్రా, జులియస్ పాకియమ్ ఈ సినిమాకు చక్కటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు సాంగ్స్‌ను అందించారు. జాకీ భగ్నానీ, వషు భగ్నానీ, దీప్షిక దేశ్‍ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్, సునీల్ శెట్టి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు.
'నాటు నాటు' బీటౌన్ వెర్షన్ - ఆ సాంగ్‌కు హుక్ స్టెప్ వేసిన అక్షయ్, టైగర్
'నా పేరు వెనక అసలు కథ ఇదే' - టైగర్ అని ఎందుకంటారంటే? - Tiger Jackie Shroff