ETV Bharat / entertainment

టాలీవుడ్​లో ట్రెండ్ ఛేంజ్- స్టార్ హీరోల సినిమాలన్నీ 'గురువారమే' - Thursday Movie Releases - THURSDAY MOVIE RELEASES

Thursday Movie Releases 2024: టాలీవుడ్​లో సినిమా రిలీజ్ వారం మారినట్లు కనిపిస్తోంది. ఇదివరకు కొత్త సినిమాలంటే శుక్రవారం రిలీజ్ అయ్యేవి. అయితే ఈ ఏడాది పలువురు స్టార్ హీరోల సినిమాలు మాత్రం గురువారమే రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఎందుకంటే?

Weekend Movies
Weekend Movies
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 12:48 PM IST

Thursday Movie Releases 2024: టాలీవుడ్​లో ఒకప్పుడు పండగలు దృష్టిలో ఉంచుకొని సినిమాలు విడుదల చేసేవారు. ఆ తర్వాత ఐటీ (IT) బూమ్ పెరగడం, వీకెండ్ కల్చర్ కూడా ఎక్కువ అవ్వడం రెండు రోజులు (శని, ఆదివారం) కలిసొస్తుందని శుక్రవారం రోజు సినిమా విడుదల చేయడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు మరోసారి టాలీవుడ్​లో ట్రెండ్ మారినట్లు కనిపిస్తోంది. వీకెండ్స్​లో లాంగ్ రన్​ కోసం ఒక రోజు ముందే అంటే గురువారమే మూవీస్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ​అలా ఈ ఏడాది రానున్న ఆయా బడా హీరోల సినిమాలు గురువారమే రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాదిలో గురువారమే రిలీజ్ కానున్న సినిమాలేంటంటే?

  • ఇండియన్ 2( భారతీయుడు 2): గత మూడేళ్లుగా ప్రేక్షకులను ఊరిస్తున్న కమల్ హాసన్ సినిమా భారతీయుడు 2. ఇప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయింది. ఈ మూవీ జూన్ 13 (గురువారం)న రిలీజ్ కానుంది. ఆ వీకెండ్ తర్వాత వచ్చే సోమవారం బక్రీద్ సెలవు కలిసివచ్చేలా ఆ మూవీ యూనిట్ రిలీజ్​ను ఇలా ప్లాన్ చేశారు. కమల్ హాసన్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీక్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు.
  • కల్కి 2898 AD: రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం మొదట మే 9న విడుదల కావాల్సింది. అయితే ఎన్నికల హడావుడి ఉండడం వల్ల ఈ మూవీ రిలీజ్ జూన్ 27కు వాయిదా చేశారు. అయితే ఈ సినిమా విడుదలవతున్న వారం లాంగ్ వీకెండ్ కాదు. కానీ, గురువారం రీలీజ్ చేయడం వలన వీకెండ్ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని సినిమా యూనిట్ భావిస్తుంది.
  • పుష్ప ది రూల్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప ది రైజ్' పాన్ ఇండియా రేంజ్​లో హిట్ అయింది. పాటలు కూడా అన్ని భాషల్లో టాప్ ప్లే లిస్ట్ లో స్థానం సంపాదించుకున్నాయి. ఇప్పుడు 'పుష్ప ది రూల్' కూడా అదే మ్యాజిక్ కొనసాగిస్తుందా లేదా అని ఆగస్టు 15న తెలుస్తుంది. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చే సెలవు ఆ తర్వాత వచ్చే వీకెండ్ ఈ మూవీకి ఉపయోగపడే అవకాశం ఉంది.
  • సరిపోదా శనివారం: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న 'సరిపోదా శనివారం' మూవీ కూడా ఆగస్ట్ 29న అంటే గురువారమే విడుదలవుతుంది. అయితే ఈ సినిమా రీలీజ్ అవుతున్న వారం ఎలాంటి లాంగ్ వీకెండ్ లేదు.
  • దేవర: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' వేసవిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ, షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం వల్ల దసరాకు వాయిదా వేశారు. ఈ చిత్రం కూడా అక్టోబర్ 10 అంటే గురువారం విడుదల కానుంది. దసరా సెలవులు ఈ మూవీ కలెక్షన్స్ పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఎట్టకేలకు ప్రభాస్ 'కల్కి' కొత్త రిలీజ్ డేట్ కన్ఫామ్ - వచ్చేది ఆ రోజే - Kalki 2898 AD Release Date

బడ్జెట్​ రూ.8 కోట్లు - కలెక్షన్స్ అంతకుమించి - ఆ బ్లాక్​బస్టర్​ మూవీకి మూడు నేషనల్ అవార్డులు కూడా - Vidya Balan Kahaani Movie

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.