This Week Release Movies : దాదాపుగా పరీక్షల సీజన్ ముగిసింది. ఎండలు బాగా పెరిగిపోయాయి. దీంతో ఈ మండు వేసవిలో చల్లని వినోదాన్ని ఇచ్చేందుకు పలు సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి ఏప్రిల్ మొదటి వారంలో మూవీ లవర్స్‌ను అలరించేందుకు వస్తున్న చిత్రాలేంటి? ఇంకా ఓటీటీలోనూ ఏయే సినిమాలు వస్తున్నాయి? చూసేద్దామా?
Vijay Deverakonda Mrunal thakur Family star : విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ నటించిన ఫ్యామిలీస్టార్ ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకుడు. దిల్ రాజు నిర్మించారు. ఇందులో విజయ్ క్లాస్ అండ్ మాస్‌గా కనిపించనున్నారు.
మలయాళం బాక్సాఫీస్ ముందు ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన మంజుమ్మల్ బాయ్స్(Manjummel Boys) 200 కోట్లకుపైగా కలెక్షన్లను వసూలు చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్, సుకుమార్ రైటింగ్స్ కలిసి తెలుగులో అందిస్తున్నాయి. ఏప్రిల్ 6న ఇది రాబోతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి నటించిన తమిళ చిత్రం మాయవన్ దాదాపు ఏడేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రాజెక్ట్-Z పేరుతో ఏప్రిల్ 6న విడుదల చేస్తున్నారు.
సూర్యతేజ ఏలే హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా భరతనాట్యం. మీనాక్షి గోస్వామి హీరోయిన్. కేవీఆర్ మహేంద్ర దర్శకుడు. పాయల్ సరాఫ్ నిర్మాత. ఇది కూడా ఏప్రిల్ 5నే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
హర్షివ్ కార్తీక్ నటించిన, దర్శకత్వం వహించిన, నిర్మించిన బహుముఖం చిత్రం వినూత్నమైన సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఇది ఏప్రిల్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ వారం ఓటీటీ చిత్రాలు/సిరీస్‌లివే!
అమెజాన్ ప్రైమ్‌లో
యే మేరీ ఫ్యామిలీ (వెబ్‌సిరీస్-3) ఏప్రిల్ 04
మ్యూజికా (హాలీవుడ్) ఏప్రిల్ 04
హౌ టూ డేట్ బిల్లీ వాల్ష్ (హాలీవుడ్) ఏప్రిల్ 05
నెట్‌ఫ్లిక్స్‌లో
టు గెదర్ (వెబ్‌సిరిస్) ఏప్రిల్ 2
ఫైల్స్ ఆఫ్ ది అన్ ఎక్స్‌ప్లైన్డ్ (వెబ్‌సిరీస్) ఏప్రిల్ 03
రిప్‌లే (వెబ్‌సిరీస్) ఏప్రిల్ 4
స్కూప్ (హాలీవుడ్) ఏప్రిల్ 05
పారాసైట్: దిగ్రే (కొరియన్ సిరీస్) ఏప్రిల్ 05
డిస్నీ+హాట్‌స్టార్‌లో
లంబసింగి (తెలుగు) ఏప్రిల్ 02
- " class="align-text-top noRightClick twitterSection" data="">
జీ5లో
ఫర్రే (హిందీ) ఏప్రిల్ 05
ఆపిల్ టీవీ ప్లస్‌లో
లూట్ (వెబ్‌సిరీస్2) ఏప్రిల్ 03
సుగర్ (హాలీవుడ్) ఏప్రిల్ 05
స్టేజ్‌పై భార్యతో కలిసి రాజమౌళి చిందులు - ఈ డ్యాన్స్ వీడియో చూశారా? - SS Rajamouli Dance
జనవరి టు మార్చ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ - బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉందంటే? - Tollywood 2024 Box Office