ETV Bharat / entertainment

'రాజా సాబ్' స్పెషల్ సాంగ్! - 17 ఏళ్ల తర్వాత ఆ స్టార్ హీరోయిన్​తో ప్రభాస్ స్టెప్పులు! - PRABHAS THE RAJA SAAB MOVIE

రాజా సాబ్ స్పెషల్ సాంగ్​లో కోలీవుడ్ నటి - షూటింగ్ ఎప్పుడంటే?

The Raja Saab Special Song
Prabhas The Raja Saab (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2024, 11:17 AM IST

The Raja Saab Special Song : ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో 'రాజా సాబ్‌' ఒకటి. మారుతి డైరెక్షన్​లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఇది ముగింపు దశ చిత్రీకరణలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్​కు మేకర్స్ ఓ స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్​కు ప్రభాస్‌తో కలిసి ఓ కోలీవుడ్ బ్యూటీ స్టెప్పులేయనున్నట్లు అప్పట్లో టాక్ నడించింది. అయితే తాజాగా ఈ విషయం గురించి మరోసారి చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార.

ఈ సినిమాలోని ఓ సాంగ్ కోసం ఇప్పటికే ఆమెను అప్రోచ్ అవ్వగా, దానికి ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెలాఖరు లేకుంటే వచ్చే నెలలో ఆ సాంగ్​ షూటింగ్ జరిగే అవకాశముందని సినీ వర్గాల టాక్. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ స్టార్ పెయిర్​ను ఒకటే స్క్రీన్​పై మళ్లీ చూసే అవకాశం దక్కనుందని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

17 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా
అయితే ప్రభాస్‌, నయనతార చివరిగా 2007లో విడుదలైన 'యోగి'లో నటించారు. ఈ ఇద్దరి జోడి బాగుందంటూ అప్పట్లో టాక్ కూడా నడిచింది. మళ్లీ ఇన్నేళ్లకు ఇప్పుడు ఈ 'రాజాసాబ్‌'తో వీరు తిరిగి కలవనున్నారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక రాజా సాబ్ విషయానికి వస్తే హారర్ కామెడీ థ్రిల్లర్​గా రానున్న ఈ చిత్రంలో​ ప్రభాస్‌ డ్యూయెల్ రోల్​లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన బర్త్​డేకు ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేయగా అందులో ఆయన కొత్త గెటప్​లో కనిపించి ఆకట్టుకున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

మరోవైపు ఈ మూవీ ఫస్ట్ సింగిల్​ను సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

ఆ హీరోయిన్​తో కలిసి యూరప్​కు 'రాజాసాబ్' ప్రభాస్!

ప్రభాస్, హను రాఘవపూడి 'ఫౌజీ' అప్డేట్ - షూటింగ్​ ఎక్కడి వరకు వచ్చిందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.