ETV Bharat / entertainment

'గ్లింప్స్‌లో ఆ ఎలిమెంట్ లేనిది అందుకే - వాటిని టీజర్‌లోనే చూడండి' - Prabhas The Raja Saab Glimpe

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 30, 2024, 9:07 AM IST

Prabhas The Raja Saab Glimpe : ప్రభాస్ లీడ్‌ రోల్‌లో తెరకెక్కుతున్న 'ది రాజాసాబ్' గ్లింప్స్‌పై నెట్టింట పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా పలు కామెంట్లు చేస్తున్నారు. వాటిలో కొన్నింటిపై డైరెక్టర్ మారుతి స్పందించారు. ఆ విశేషాలు మీ కోసం

Prabhas The Raja Saab Glimpe
Prabhas (ETV Bharat)

Prabhas The Raja Saab Glimpe : పాన్ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్‌ రోల్‌లో డైరెక్టర్ మారుతి తెరక్కెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాజాసాబ్'. హారర్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా ఓ స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఆద్యంతం ఆకట్టుకున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా వింటేజ్ డార్లింగ్ ఈ బ్యాక్‌ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

అయితే ఈ గ్లింప్స్‌లో ప్రభాస్‌కు ఒక్క డైలాగ్‌ కూడా లేదని కొందరు ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై డైరెక్టర్ మారుతి స్పందించారు. 'గ్లింప్స్‌లో ఒక్క డైలాగైనా పెట్టొచ్చు కదా అన్నా' అని ఓ అభిమాని అడగ్గా, అవన్నీ టీజర్‌లోనే అంటూ మారుతి సమాధానమిచ్చారు.

తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు. 2025 ఏప్రిల్ 10న ఈ చిత్రం పాన్ఇండియా లెవెల్‌లో విడుదల కానున్నట్లు తెలిపారు. ఇందులో ప్రభాస్‌తో పాటు మాళవిక మోహనన్‌, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌ దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్స్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా కార్తీక్ పళని, ఎడిటర్ గా కోటగిరి వేంకటేశ్వర రావు పని చేస్తున్నారు. హార్రర్ కామెడీగా తెరకెక్కతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మరోవైపు 'ది రాజాసాబ్' సినిమా ప్రేక్షకులకు ఓ విజువల్స్ ట్రీట్​గా ఉండనుందంటూ మేకర్స్ ఇప్పటికే పలు మార్లు చెప్పారు. మూవీ ఔట్​పుట్‌ సూపర్‌ క్వాలిటీ కోసం అత్యుత్తమ టెక్నాలజీ వాడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఎడిటింగ్​​లో ఎక్కువగా VFX ఉపయోగించామని వాటిని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని అన్నారు. ఇక ఈ సినిమాతో ఆడియెన్స్​కు​ పవర్​ఫుల్ కంటెంట్ అందిస్తామంటూ నిర్మాతలు కూడా ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

రాజమౌళి లాంటి పిచ్చోడిని చూడలేదు! : ప్రభాస్ - Netflix Rajamouli Documentary

ప్రభాస్ సినిమాలో అమితాబ్ హిట్ సాంగ్ - క్లారిటీ ఇచ్చిన 'రాజాసాబ్' నిర్మాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.