ETV Bharat / entertainment

OTTలోకి సూపర్ హిట్ మార్వెల్​ సినిమా - ఎందులో స్ట్రీమింగ్ అంటే? - hollywood movie the marvels

The Marvels Ott Release Date : హాలీవుడ్ మూవీ 'ది మార్వెల్స్‌' ఓటీటీ రిలీజ్​కు రెడీ అయింది. ఈ సూపర్ హిట్ సినిమా ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 4:20 PM IST

Updated : Jan 23, 2024, 4:59 PM IST

The Marvels Ott Release Date : హాలీవుడ్‌ మూవీస్​ అంటేనే కళ్లు చెదిరే ఊహకందని యాక్షన్‌ సీన్స్​ కళ్ల ముందు తిరుగుతుంటాయి. అందులోనూ మార్వెల్‌ యూనివర్స్‌ మూవీస్ అంటే ఏ రేంజ్‌లో ఆడియెన్స్​ను అలరిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ యూనివర్స్‌ నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు, అభిమానలు ఆనందపడిపోతారు. ఇప్పటికే ఈ బ్యానర్​ నుంచి వచ్చిన 'స్పైడర్‌ మ్యాన్‌', 'ది అవెంజర్స్‌', 'బ్లాక్‌ పాంథర్‌', 'కెప్టన్‌ మార్వెల్‌' వంటి సినిమాలు బాక్సాఫీస్​ ముందు వసూళ్లను అందుకున్నాయి. అయితే ఈ సిరీస్‌ నుంచి ఈ మధ్యే వచ్చిన మరో చిత్రం 'ది మార్వెల్స్‌'. మార్వెల్‌ స్డూడియోస్‌ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలలో పాజిటివ్​ ​ టాక్​ రివ్యూను అందుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్​ఫామ్ వేదికగా స్ట్రీమింగ్​కు​ సిద్ధమైంది.

సహజంగా సూపర్‌ హీరో మూవీస్ అంటే యూనివర్స్‌లో ఆ హీరో చేసే సాహసాలు, స్టంట్స్​ను వెండితెరపై అద్భుతంగా చూపిస్తారు. కానీ ఈ సారి దీనికి భిన్నంగా వచ్చందే చిత్రం. ఈ సినిమా కోసం మొదటి సారి ముగ్గురు హీరోయిన్స్​ కలిసి నటించారు. ఉమెన్‌ పవర్‌ చూపిస్తూ మార్వెల్‌కు చెందిన ముగ్గురు సూపర్‌ హీరోయిన్స్‌ ఒకే మూవీలో కనిపించబోతుండటం వల్ల ఓటీటీ ఆడియోన్స్​లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే థియేటర్లలో రిలీజై మంచి టాక్ తెచ్చకున్న 'ది మార్వెల్స్‌' కోసం వరల్డ్​ వైడ్​గా ఉన్న ఓటీటీ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హాలీవుడ్ ప్రముఖ కామిక్ నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ వేదికగా డిస్నీ+ హాట్ స్టార్​లో ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్ వైడ్​గా స్ట్రీమింగ్​కు రెడీ అయింది.

ఈ చిత్రాన్ని ప్రముఖ హాలీవుడ్‌ దర్శకురాలు నియో డకోస్టా డైరెక్ట్ చేశారు. ఇందులో బ్రీ లార్సెన్‌, టెయోనా ప్యారిస్‌, ఇమాన్‌ వెల్లని, పార్క్‌ సియో జూన్‌ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కెప్టెన్‌ మార్వెల్‌ పాత్రలో బ్రీ లార్సెన్‌ నటించింది. యాక్షన్‌, అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పాటకు రూ. 50లక్షలు! - అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కొరియోగ్రాఫర్ ఎవరంటే ?

'ఎమర్జెన్సీ' మూవీ రిలీజ్​ డేట్​ - మేకర్స్ కీలక ప్రకటన!

Last Updated : Jan 23, 2024, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.