ETV Bharat / entertainment

OTTలో ఆత్మలతో ఇన్వెస్టిగేషన్ - ఒక్కో ఎపిసోడ్​ సీట్ ఎడ్జ్​ థ్రిల్​తో! - Amazon prime last hour series

The Last Hour Series : ఓటీటీలో భాషతో సంబంధం లేకుండా పలు రకాల జానర్ సినిమా సిరీస్​లు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. మరి మీరు ఆత్మలతో ఇన్వెస్టిగేషన్ చేసే సిరీస్​ను చూశారా? హాలీవుడ్ రేంజ్​లో రూపొందిన ఈ సిరీస్​ ఓటీటీ ప్రేక్షకులను గత రెండేళ్లుగా అలరిస్తూనే ఉంది. ఇంతకీ ఆ సిరీస్ ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోందంటే?

OTTలో ఆత్మలతో ఇన్వెస్టిగేషన్ - ఒక్కో ఎపిసోడ్​ సీట్ ఎడ్జ్​ థ్రిల్​తో!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 3, 2024, 5:16 PM IST

The Last Hour Series : ఓటీటీలో ప్రతి వారం ఎన్నో వెబ్ సిరీసులు వస్తుంటాయి. సదరు ఓటీటీ ప్లాట్​ఫామ్ సంస్థలు స్వయంగా నిర్మించి మరీ వాటిని విడుదల చేస్తుంటాయి. అలాంటి వాటిలో ది లాస్ట్ అవర్ కూడా ఒకటి. ఫస్ట్​ ఎపిసోడ్ నుంచి లాస్ట్​ ఎపిసోడ్ వరకు థ్రిల్లింగ్​గా సాగుతూ ఆడియెన్స్​కు సీట్ ఎడ్జ్​ థ్రిల్​ను పంచుతోంది. ఇందులో సంజయ్ కపూర్, కర్మ తకాపా, షేలీ కే లీడ్ రోల్స్​లో నటించారు.

ఈ సిరీస్​ మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో అమెజాన్​ ప్రైమ్​లో 2021లో రిలీజైంది. ఒక్కో ఎపిసోడ్ కనీసం 30 నిమిషాల నిడివితో ఉత్కంఠగా సాగుతుంటుంది. సిరీస్​ మొత్తంలో ఇన్వెస్టిగేషన్ సీన్స్(కేసును దర్యాప్తు చేసే సన్నివేశాలు) బాగా మెప్పిస్తున్నాయి. పోలీసుల చేతికి చిక్కకుండా హత్యలు చేయడం, హంతకుడిని కనిపెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తుండటం, ఈ క్రమంలో వారు ఆత్మలతో మాట్లాడటం, మరోవైపు ప్రజలు తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని భయంభయంగా ఉండటం ఇలా సిరీస్ మొత్తం ఇన్​టెన్స్​గా సాగుతూ ముందుకు వెళ్తుంది.

కథ ఇదే : ముంబయిలో అరుప్(సంజయ్ కపూర్) అనే పోలీసు అధికారి ఉంటాడు. ఓ బెంగాలీ నటి మర్డర్ కేసును సాల్వ్ చేసేందుకు అతడిని ఈశాన్య రాష్ట్రానికి పంపిస్తారు. అయితే అక్కడ మరిన్ని వరుస మర్డర్లు జరగడం కలకలం రేపుతుంది. ప్రజలు భయపడుతూ ఉంటారు. ఎవరీ హత్యలు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అసలు ఆ హంతకుడి మోటో ఏంటి తెలీక పోలీసు అధికారులు తమ దర్యాప్తును మరింత లోతుగా తీసుకెళ్తుంటారు.

అయితే అరుప్​కు సాయంగా ఈ కేసు దర్యాప్తులో దేవ్​(కర్మా తపాకా) జాయిన్ అవుతాడు. విశేషమేమిటంటే దేవ్​కు ఆత్మలతో మాట్లాడే శక్తి ఉంటుంది. లోకాన్ని వదిలి వెళ్లకుండా ఇక్కడే తిరుగుతూ ఉండే ఆత్మలతో అతడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఈ హత్యలకు సంబంధించిన కేసులో ఆత్మలతో కలిసి హంతకుడిని పట్టుకునేందుకు సిద్ధమవుతారు దేవ్​, అరుప్​. మరి చివరికి ఈ ఆత్మల సాయంతో హంతుకుడిని వాళ్లు పట్టుకున్నారా? కేసును ఛేదించారా? లేదా అన్నదే ఈ సిరీస్ కథ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సీక్రెట్​గా బాలయ్య బాబు పరిచయం చేసిన బ్యూటీ పెళ్లి - ఫ్యాన్స్ సర్​ప్రైజ్​!

ఆ నిర్మాతతో జబర్దస్త్ రోహిణి ప్రేమాయణం -స్టేజ్​ మీద నటి క్లారిటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.