The Kerala Story OTT Release Date : గతేడాది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సినిమా 'ది కేరళ స్టోరీ'. సినీ రంగంలోనే కాకుండా రాజకీయంగానూ సంచలనం సృష్టించింది. 2023లో మే 5న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు వాటికి ఫుల్‌స్టాప్ పెడుతూ ఇది వచ్చేస్తోంది. ఫిబ్రవరి 16 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జీ5' వేదికగా స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రసారం కానుంది.
ది కేరళ స్టోరీ సినిమాలో నటి అదాశర్మ ప్రధానపాత్రలో కనిపించారు. ప్రకటించిన దగ్గరినుంచే వివాదాలను ఎదుర్కొన్న ఈ సినిమాను మనదేశంలోని కొన్ని రాష్ట్రాలు బ్యాన్ చేశాయి. మరికొన్ని రాష్ట్రాలు వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చాయి. ప్రముఖ రాజకీయ నాయకులు దీనిపై పోస్ట్‌లు పెట్టడం వల్ల గతేడాది ఈ చిత్రం హాట్ టాపిక్‌గా నిలిచింది.
డైరెక్టర్ సుదీప్తోసేన్ 'ది కేరళ స్టోరీ'కి దర్శకత్వం వహించారు. కేరళలో కొన్ని సంవత్సరాలుగా '32 వేల మంది' మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో దీన్ని చిత్రీకరించారు. ఓ నలుగురు యువతులు మతం మారి, అనంతరం ఐసిస్‌లో చేరిన నేపథ్యంతో కథ నడుస్తుంది. అయితే, తప్పిపోయిన అమ్మాయిలు మతం మారి, ఉగ్రవాద శిక్షణ పొంది, ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో చూపించడం వివాదానికి దారితీసింది. ఈ చిత్రానికి నిర్మాతగా విపుల్ అమృత్‌లాల్ షా వ్యవహరించారు. గతంలో 'అస్మా', 'లఖ్‌నవూ టైమ్స్', 'ది లాస్ట్ మాంక్' వంటి చిత్రాలు నిర్మించారు.
1500 శాతం లాభం!
అయితే కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన పాన్ఇండియా మూవీ 'కేరళ స్టోరీ', బాక్సాఫీస్ వద్ద అత్యధిక లాభాలను అర్జించి రికార్డుకెక్కింది. ఈ మూవీ కేవలం మౌత్ టాక్‌తోనే వరల్డ్‌వైడ్‌గా రూ. 303 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా గ్లోబల్ నెట్ హాల్ కూడా రూ. 250 కోట్లకు పైగా దాటింది. ఈ సినిమా నిర్మాణానికి అయిన ఖర్చుతో పోలిస్తే 1500 శాతానికి పైగా లాభాన్ని అర్జించింది.
గ్యారేజీలో నివాసం - 200 రూపాయల సంపాదన - ఇప్పుడు బీటౌన్ సూపర్ స్టార్