ETV Bharat / entertainment

తెలుగులోనూ హర్రర్ సినిమాల జోరు- టాప్ 10 మూవీస్ లిస్ట్ ఇదే- మీరేం చూస్తారు? - Telugu Top 10 Horror Movies OTT

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 22, 2024, 3:19 PM IST

Telugu Top-10 Horror Movies OTT: టాలీవుడ్​లోనూ రోజురోజుకు హర్రర్ సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. అలా గత కొన్నేళ్లుగా తెలుగులో వచ్చిన హర్రర్ సినిమాలు ప్రస్తుతం ఆయా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో టాప్- 10 సినిమాలు ఎవో చూద్దాం.

Telugu Top-10 Horror Movies OTT
Telugu Top-10 Horror Movies OTT

Telugu Top-10 Horror Movies OTT: హర్రర్ సినిమా అని తెలిసినా చూస్తాం. పైగా భయానికి పాత, కొత్త అని ఉండవు. చూడని సినిమా అయితే చాలు పాతదైనా సరే శ్రద్ధగా చూస్తూ భయపడుతుంటాం. ఇక ఈ ఓటీటీలు వచ్చాక థియేటర్లకు వెళ్లి భయపడాల్సిన అవసరం లేకుండా పోయింది. హ్యాపీగా, ఫ్లెక్సిబుల్​గా ఇంట్లోనే లైట్స్ ఆఫ్ చేసుకుని, పాప్ కార్న్ తింటూ కూర్చొని ఎంజాయ్ చేయవచ్చు. అయితే ఆయా ఓటీటీ ప్లాట్​ఫామ్​లో స్ట్రీమింగ్​కు అందుబాటులో ఉన్న టాప్- 10హర్రర్ సినిమాల గురించి మీకోసం.

  • మసూద (2022): రైటర్- డైరక్టర్: సాయి కిరణ్సినిమా, సమయం: 2.40 గంటలు, IMDB Rating: 7.2/10, నటులు: తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, సంగీత, ఓటీటీ : ఆహా. నిస్సహాయతతో నిండిన మహిళ తన కూతురికి ఎదురైన కష్టాన్ని ఎలా ఎదుర్కొంటుందనేది కథ. ఇందులో ప్రధాన తారలుగా నటించిన తిరువీర్, సంగీత అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.
  • భూతకాలం (2022): రైటర్ - డైరక్టర్: రాహుల్ సదాశివన్సినిమా, సమయం: 1.45 గంటలు, IMDB Rating: 7.5/10, నటులు: షేన్ నిగం, రేవతి, ఓటీటీ: సోనీ లివ్. ఈ భూతకాలం సినిమా రాహుల్ సదాశివన్​కు డైరక్టర్​గా మొదటి సినిమా. దేవుడిచ్చిన వరం వల్ల అతను తాకితేనే ట్రాప్​లో ఇరుక్కుపోతుంటారు. సాధారణమైన ఇల్లే ఒక్కసారిగా భయంకరమైన నివాసంగా మారిపోతుంది. దానిలో నుంచి ఎలా బయటపడ్డారనేదే కథ.
  • మా ఊరి పొలిమేర (2021): రైటర్ - డైరక్టర్: అనిల్ విశ్వనాథ్సినిమా సమయం: 1.38 గంటలు, IMDB Rating: 7.2/10, నటులు: సత్యం రాజేశ్, సాహితీ, బాలాదిత్య, ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్​స్టార్​ తెలుగులో రిలీజై సూపర్ హిట్ సాధించిన సినిమాల్లో మా ఊరి పొలిమేర టాప్ లిస్ట్​లో ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో జరిగే కథ ఇది. చేతబడి, బాణామతి లాంటి డార్క్ మ్యాజిక్ ఆ గ్రామవాసులపై ఎలాంటి ప్రభావం చూపిందనేది కథాంశం.
  • అంధగారం (2020): రైటర్ -డైరక్టర్: వీ. విఘ్నరాజన్సినిమా సమయం: 2.51 గంటలు IMDB Rating: 7.5/10, నటులు: అర్జున్ దాస్, పూజ్ రామచంద్రన్, వినోద్ కిషన్, ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్. అంధగారం సినిమా తమిళంలో విడుదలైంది. డైరక్టర్ వి. విఘ్నరాజన్ తొలి సినిమా అయిన బాగా తెరకెక్కించారు. సూపర్ నేచరల్ ఎలిమెంట్స్, సైకలాజికల్ పాయింట్లతో కథ నడుస్తుంది.
  • భాగమతి (2018): రైటర్ -డైరక్టర్: జీ అశోక్సినిమా సమయం: 2.18 గంటలు, IMDB Rating: 7/10, నటులు: అనుష్క శెట్టి, జయరాం, ఆది పినిశెట్టి , ఓటీటీ: ప్రైమ్ వీడియో/ డిస్నీ ప్లస్ హాట్ స్టార్​ భాగమతీ సినిమా టైటిల్ రోల్​లో అనుష్క శెట్టి కనిపించారు. భాగమతి నిలయంలో జరిగే కథ. రాణి భాగమతి గురించి అంతా తెలుసుకుని చంచల అనే ఐఏఎస్ ఆఫీసర్ దుర్మార్గులను ఎలా ఆటపట్టించిందనేది కథనం.
  • అవల్ (2017): రైటర్ -డైరక్టర్: మిలింద్ రావ్సినిమా, సమయం: 2.17 గంటలు, IMDB Rating: 6.7/10నటులు: సిద్దార్థ్, ఆండ్రియా జెరెమియా, అనీషా విక్టర్, ఓటీటీ: జియో సినిమా. ఒక న్యూరో సర్జన్ అతని భార్యతో కలిసి కొత్త ఇంటికి మారతారు. వెంటనే వారు ఒక దెయ్యాలకొంపలోకి అడుగుపెట్టినట్లు తెలుసుకుంటారు.
  • పిసాసు (2014): రైటర్ -డైరక్టర్: మైస్కిన్ సినిమా సమయం: 1.54 గంటలు, IMDB Rating: 7.5/10నటులు: ప్రయాగ మార్టిన్, రాధా రవి, కళ్యాణి, ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్​. వెన్నులో వణుకు పుట్టించే సినిమా మైస్కిన్. యాక్సిడెంట్ కు గురై ప్రాణాలు కోల్పోయిన మహిళ.. తనను కాపాడేందుకు ప్రయత్నించిన వ్యక్తితో పాటే ఉంటుంది. అతనితో పాటు ఉండి ఆమె ఏమేం చేసిందనేది కథాంశం.
  • పిజ్జా (2012): రైటర్ -డైరక్టర్: కార్తీక్ సుబ్బరాజ్​, సమయం: 2 గంటలు IMDB Rating: 8/10, నటులు: విజయ్ సేతుపతి, బాబీ సింహ, రమ్య నంబీసన్, పూజ రామచంద్రన్, ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్​. హర్రర్ థ్రిల్లర్ పిజ్జాతో కెరీర్ మొదలుపెట్టిన కార్తీక్ సుబ్బరాజ్.. కథను పిజ్జా డెలివరీ బాయ్ చుట్టూ నడిపిస్తాడు. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నడిచే కథ ఆద్యంతం ముచ్చెమటలు పట్టిస్తుంది.
  • యవరుం నాలుం (2009): రైటర్ -డైరక్టర్: విక్రమ్ కుమార్సినిమా సమయం: 2.17 గంటలు, IMDB Rating: 7.3/10నటులు: ఆర్ మాధవన్, నీతూ చంద్ర, సచిన్ ఖేడేకర్, ఓటీటీ: ప్రైమ్ వీడియో/ డిస్నీ ప్లస్ హాట్ స్టార్​. వరుం నాలుం (13B), తమిళ భాషలో విడుదలైన హర్రర్ థ్రిల్లర్. ఒక ఇంట్లో జరిగే సీరియల్ కథలాగే వారి ఇంట్లో పాత్రలు ఉండటం అందులో జరిగినట్లుగా వారి నిత్య జీవితంలో ఘటనలు సంభవిస్తుండటం మిమ్మల్ని స్క్రీన్ కి కట్టిపారేస్తాయి.
  • మణిచిత్రతాఝూ (1993): రైటర్ -డైరక్టర్: ప్రియదర్శని, సమయం: 2.49 గంటలు, IMDB Rating: 8.8/10, నటులు: మోహన్ లాల్, శోభన, సురేశ్ గోపీ, ఓటీటీ: ప్రైమ్ వీడియో/ డిస్నీ ప్లస్ హాట్ స్టార్​. భయానికి పాత, కొత్త లేదని ఈ సినిమా 1993లో విడుదలైనా ఇప్పటికీ ఇండియన్ సినిమాలోనే ఒక ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నది. ఈ మూల కథను తీసుకుని రీమేక్ చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

OTTలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ యాక్షన్​ థ్రిల్లర్​ ఫైటర్ - కానీ ఓ ట్విస్ట్!

ఓటీటీలో హార్ట్ బీట్ పెంచే హారర్ మూవీస్​ - అక్కడ ఫ్రీగా చూడొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.