ETV Bharat / entertainment

నిన్న రేషన్​ కోసం - నేడు ప్రైజ్​ మనీ కోసం - హోరాహోరీగా ఫైట్​ చేస్తున్న కంటెస్టెంట్లు - ప్రోమోలు చూశారా? - Tasks for Prize Money in Bigg Boss - TASKS FOR PRIZE MONEY IN BIGG BOSS

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ సీజన్ 8లో ఆట మంచి రంజుగా సాగుతోంది. ముఖ్యంగా నిఖిల్ టీమ్ పడిలేచిన కెరటంలా అదరగొడుతోంది. దీనికి సంబంధించి ప్రోమోలు కూడా రిలీజ్​ అయ్యాయి. మరి ఈ టాస్కుల్లో ఎవరు గెలిచారు? ఏమైందనే దానిపై ఓ లుక్కేద్దాం.

Tasks for Prize Money
Tasks for Prize Money in Bigg Boss 8 (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 12, 2024, 5:17 PM IST

Tasks for Prize Money in Bigg Boss 8: బిగ్​బాస్​లో రెండో వారం ఆట మజాగా సాగుతోంది. వారంలో మొదటి రెండు రోజులు నామినేషన్లు జరగ్గా.. మాటల తుటాలు పేల్చుకున్న కంటెస్టెంట్లు.. ఇక టాస్కుల్లో తమ సత్తా చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్నటి బిగ్​బాస్ ఆటలో రేషన్ కోసం తెగ కష్టపడిపోయారు. ఎవరి రేషన్ వాళ్లే సంపాదించుకోవాలని బిగ్ బాస్ చెప్పడంతో.. కంటెస్టెంట్స్‌లో కొంతమంది ఫైట్​ చేశారు. ఇదిలా ఉంటే.. నేటి ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలో ప్రైజ్ మనీని పెంచుకోవడానికి హౌజ్​లో ఉన్న వాళ్లకి టాస్క్ ఇచ్చారు బిగ్​బాస్​. ఇంతకుముందే ఈ సీజన్​లో నో ఫ్రైజ్​ మనీ అని.. ఎవరు ఎంత సంపాదించుకుంటే వారిదే అని నాగార్జున చెప్పారు. దీంతో ప్రైజ్​ మనీ కోసం టాస్కులు మొదలుపెట్టారు బిగ్​బాస్​. ఇందుకు సంబంధించిన రెండు ప్రోమోలు రిలీజ్​ చేశారు. మరి ఈ టాస్కుల్లో ఎవరు గెలిచారు? ఏమైందనే దానిపై ఓ లుక్కేద్దాం.

మొదటి ప్రోమో చూస్తే.. డబ్బులు గెలుచుకునేందుకు మొదటగా.. బజర్ మోగినప్పుడు నాగ మణికంఠ, సోనియా, విష్ణు ప్రియలు స్విమ్మింగ్ పూల్‌లో దూకాలని టాస్క్ ఇచ్చారు. అయితే "నేనే విన్నర్‌" అని ఫీల్ అవుతున్న స్వయం ప్రకటిత బిగ్ బాస్ విన్నర్ సోనియా.. బొక్క బోర్లా పడింది. స్విమ్మింగ్ పూల్‌లోకి వెళ్లే ప్రయత్నంలో కిందపడిపోయింది. దాంతో విష్ణు ప్రియ, మణికంఠలు స్విమ్మింగ్ పూల్‌లో దూకి టాస్క్ కంప్లీట్ చేశారు. అయితే పృథ్వీ ఎటాకింగ్‌గా ఆడి.. నిఖిల్‌ని అడ్డుకోవడంతో.. "రేయ్ మనం ఆర్టిస్ట్‌లం.. ఇలా తన్నుకుని తలలు పగిలితే.. ఎవరు రెస్పాన్సిబిలిటీ" అని నిఖిల్​ అడిగితే.. సెంటిమెంట్‌ని పక్కనపెట్టు అని యష్మీ గౌడ మాట్లాడింది. ఆ తరువాత.. కలర్ బాల్ టాస్క్‌లో పృథ్వీ, నిఖిల్‌, నబీల్​లు పోటీ పడ్డారు. నబీల్​ ముందుగానే వదిలేయడంతో.. పృథ్వీ వర్సెస్ నిఖిల్ మధ్య హోరా హోరీ పోరు నడిచింది. ఇక ఇందులో ఎవరు గెలిచారో తెలియదు.

"రేషన్​" కోసం కంటెస్టెంట్ల తంటాలు - నువ్వా నేనా అంటూ పోటిపడిన కిర్రాక్​ సీత - మణికంఠ!

రెండో ప్రోమో చూస్తే.. ఏకంగా లక్షా 50 వేల ప్రైజ్ మనీ టాస్కు ఒకటి బిగ్‌బాస్ ఇచ్చాడు. ఇక దీనికి మూడు టీముల నుంచి నిఖిల్, ఆదిత్య, అభయ్‌కి అవకాశం ఇచ్చాడు. ఇందులో భాగంగా గ్లాసులో మినిట్ మేడ్ పల్పీ ఆరెంజ్ పోసే సమయంలో ఎవరి చేతిలో అయితే గ్లాస్ నుంచి జ్యూస్ బయటికి కారిపోతుందో ఆ సభ్యుడు ఔట్ అయిపోయినట్లే. ఇక ఇందులో ముగ్గురూ చాలా జాగ్రత్తగా గ్లాసులో పల్పీ ఆరెంజ్ పోశారు. మరి ఎవరు గెలిచారో తెలియాల్సి ఉంది. కానీ ఈ టాస్కు గెలిస్తే మాత్రం ఏకంగా లక్షా 50 వేలు ప్రైజ్ మనీ పెరుగుతుంది. ఇక మరో అవకాశంగా వ్యాక్స్ చేసుకోవాలంటూ టాస్కు పెట్టాడు బిగ్‌బాస్. ఇక దీనికి పృథ్వీ, నిఖిల్, నబీల్ పోటీ పడ్డారు. కానీ ఆట మధ్యలోనే పృథ్వీ నొప్పి తట్టుకోలేక పక్కకెళ్లిపోయాడు. కానీ నిఖిల్, నబీల్ మాత్రం గట్టిగానే ప్రయత్నించారు.

ఇక ప్రోమో చివరిలో యష్మీ అండ్​ విష్ణుప్రియ మధ్య కాస్తా వార్​ నడిచింది. "మా పాల ప్యాకెట్ ఎందుకు తీశావు" అంటూ విష్ణుప్రియను యష్మీ కొశ్చన్ చేయగా.. "మరి మా చికెన్ మీరు కొట్టేయలేదా" అని విష్ణు అడిగింది. దీంతో "నువ్వు చూశావా.. ప్రూఫ్ ఉందా" అంటూ వాదించింది యష్మీ.

బిగ్​ బాస్​లో లవ్​ బర్డ్స్! - వాళ్ల మధ్య లవ్ ట్రాక్ కన్ఫామ్ అంటగా?

బిగ్ బాస్ 8 : నాగమణికంఠ భార్య ఎవరో తెలిసిపోయిందిగా - పెళ్లి వీడియో వైరల్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.