ETV Bharat / entertainment

ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు అనుమానాస్పద మృతి - Actor pradeep k vijayan Died - ACTOR PRADEEP K VIJAYAN DIED

Actor pradeep k vijayan Died : ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ప్రదీప్‌ కె.విజయన్‌ అనుమానాస్పద స్థితిలో మరణించారు. పూర్తి వివరాలు స్టోరీలో

Source ETV Bharat
pradeep k vijayan (Source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 13, 2024, 6:26 PM IST

Actor pradeep k vijayan Died : ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. కోలీవుడ్‌లో నటుడు ప్రదీప్‌ కె.విజయన్‌ అనుమానాస్పద స్థితిలో మరణించారు. చెన్నైలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించారు. రెండు రోజుల క్రితమే ఆయన చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే - ప్రదీప్‌కు ఇంకా వివాహం అవ్వలేదు. చెన్నై పాలవాక్కమ్‌లోని ఓ ఫ్లాట్‌లో ఒంటరిగానే ఉంటున్నారు. అయితే గత రెండు రోజులుగా స్నేహితులు ఎన్ని సార్లు కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయట్లేదు. దీంతో అనుమానం వచ్చిన ఓ ఫ్రెండ్​ నటుడి ఇంటికి వెళ్లి చూశారు. అక్కడ లోపలి నుంచి తాళం వేసి ఉంది. ఎన్నిసార్లు కొట్టినా తలుపు ప్రదీప్​ తీయలేదు. దీంతో అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

వెంటనే పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టారు. అనంతరం ఇంట్లోకి వెళ్లగా బాత్​ రూమ్​లో ప్రదీప్‌ విగతజీవిగా కనిపించారు. తలకు బలమైన గాయం తగలడం లేదా గుండెపోటు రావడం వల్ల ఆయన మరణించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్‌మార్టం కోసం ఆయన మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. దీని రిపోర్ట్ రావాల్సి ఉంది. అయితే కొద్ది రోజుల క్రితమే ప్రదీప్‌ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినట్లు ఆయన స్నేహితుడు పోలీసులకు వివరించారు. ఆయన మృతి గురించి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

Actor pradeep k vijayan Movies : కాగా, కోలీవుడ్​లో పప్పుగా పేరు సంపాదించుకున్నారు ప్రదీప్‌. 2013లో ఇండస్ట్రీకి వచ్చారు. తెగిడి చిత్రంతో క్రేజ్ సంపాదించుకున్నారు. టెడ్డీ, హే సినామిక వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బానే పరిచయమయ్యారు. చివరిగా రాఘవ లారెన్స్‌ నటించిన రుద్రన్‌ చిత్రంలో నటించారు. ఇక త్వరలోనే రిలీజ్ కానున్న విజయ్‌ సేతుపతి మహారాజ సినిమాలోనూ ప్రదీప్‌ నటించారు. సపోర్టింగ్‌ క్యారెక్టర్‌ రోల్​ పోషించారు. ఈ సినిమా జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇండియాస్​​ బిగ్గెస్ట్ వార్​ ఫిల్మ్ - 27ఏళ్ల తర్వాత సీక్వెల్​ సిద్ధం

'కల్కి'పై హాలీవుడ్ ఆర్టిస్ట్ షాకింగ్ ఆరోపణలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.