ETV Bharat / entertainment

నాకు అప్పుడే పెళ్లి అయ్యింది - అందుకే అందరూ సీక్రెట్ మ్యారేజ్ అనుకుంటున్నారు : తాప్సీ - TAAPSEE PANNU MARRIAGE

పెళ్లి డేట్ విషయంలో కన్​ఫ్యూజన్ - అందుకే ఎవ్వరికీ ఆ విషయం తెలియకపోవచ్చు : తాప్సీ

Taapsee Pannu Marriage
Taapsee Pannu (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Taapsee Pannu Marriage Year : బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను తాజాగా తన పెళ్లి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. నటి తాప్సీ పన్ను. అందరూ అనుకుంటున్నట్లు తన వివాహం ఈ ఏడాదిలో జరగలేదని 2023లోనే జరిగిందని చెప్పింది. తాజాగా ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ నిర్వహించిన మీట్​లో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని తెలియజేసింది.

"మా పెళ్లి గతేడాది డిసెంబర్‌లోనే జరిగింది. అయితే మేము ఇరు కుటుంబాలు అలాగే కొంతమంది సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నాం. త్వరలోనే మా ఫస్ట్ యానివర్సరీ రానుంది. నేడు ఈ విషయాన్ని నేను బయటపెట్టకపోతే ఎవరికీ దీని గురించి అస్సలు తెలియకపోవచ్చు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలకు సంబంధించి సరైన బ్యాలెన్స్‌ ఉండాలనే మేము ఎప్పుడూ అనుకున్నాం. మన లైఫ్​కి సంబంధించిన కొన్ని విషయాలు బయటపెడితే అది వృత్తిపరమైన విషయాలకు ఆటంకంగా మారుతుంది. అదేవిధంగా వర్క్‌ లైఫ్‌లో సక్సెస్‌ లేదా ఫెయిల్యూర్స్​ ఉంటే అవి అధికంగా పర్సనల్‌ లైఫ్‌పై ప్రభావం చూపిస్తాయి. దీని కారణంగా లేనిపోని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అది మాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే పర్సనల్ విషయాలను మేము పెద్దగా బయటకు చెప్పాలనుకోము. డిసెంబర్‌లో పెళ్లి తర్వాత ఆత్మీయులు, సన్నిహితుల కోసం ఉదయ్‌పుర్‌లో ఓ ప్యాలెస్​లో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నాం. అయితే ఆ వేడుకకు ఆత్మీయులను మాత్రమే ఆహ్వానించాం. అంతేకానీ దాని గురించి ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదు. అందువల్లనే మా పెళ్లిని అందరూ సీక్రెట్‌ మ్యారేజ్‌ అని అనుకున్నారు" అని తాప్సీ అసలు విషయం చెప్పుకొచ్చింది.

ఇక డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయరైన మథియాస్‌ బో తో తాప్సీ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. సుమారు పదేళ్ల నుంచి తనతో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సౌత్​ నుంచి బీటౌన్​లోకి అడుగుపెట్టిన ఈ చిన్నదానికి అప్పటి తొలినాళ్లలోనే అతడితో పరిచయం ఏర్పడిందని, ఇక అప్పటి నుంచి ఆ బంధం అలాగే కొనసాగుతున్నట్లు చెప్పుకొచ్చింది.

'కొన్ని విషయాల్లో మేమిద్దరం ఒకేలా ఆలోచిస్తాం - అందుకే ఆయన అంటే ఇష్టం' - Taapsee Favourite Hero

సాత్విక్‌-చిరాగ్‌ ఓటమి - తాప్సీ భర్త షాకింగ్ డెసిషన్ - Paris Olympics 2024 Taapsee Husband

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.