ETV Bharat / entertainment

మరోసారి మంచి మనసు చాటుకున్న సూర్య - ఫ్యాన్స్​కు స్పెషల్​ ట్రీట్​ - ఎందుకంటే ? - ఫ్యాన్స్​కు సూర్య స్పెషల్ ట్రీట్

Suriya Special Treat To Fans : కోలీవుడ్ స్టార్ సోదరులు సూర్య, కార్తి తాజాగా తమ ఫ్యాన్స్​ను కలుసుకున్నారు. అంతే కాకుండా వారి కోసం స్పెషల్ విందును అరేంజ్​ చేశారు. ఎందుకంటే ?

Suriya Special Treat to fans
Suriya Special Treat to fans
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 2:11 PM IST

Suriya Special Treat To Fans : ఎవరికైనా సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు హీరోలు సూర్య, కార్తి. వరదల సమయంలోనూ తమవంతు సహాయాన్ని ఈ స్టార్స్ తాజాగా మరోసారి తమ మంచి మనసు చాటుకున్నారు. తమ ఫ్యాన్స్​ కోసం స్పెషల్​గా విందు ఏర్పాటు చేశారు. వాళ్లతో కాసేపు ముచ్చటించారు.

గతంలో మిగ్‌జాం తుపాను చైన్నైను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. దాని దెబ్బకు చెన్నై మహా నగరం మొత్తం నీటమునిగి అక్కడి ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. విష్ణు విశాల్​, రవిచంద్రన్ అశ్విన్​ లాంటి స్టార్స్​ సైతం తమ పరిశరాల పరిస్థితి గురించి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. ఆ సమయంలో సూర్య తన అభిమానులందరూ స్వచ్ఛందంగా వచ్చి బాధితులను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా తనవంతుగా రూ.10 లక్షలు ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు.

ఇదిలా ఉండగా, తమ అభిమాన తార మాట కోసం సూర్య ఫ్యాన్స్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారికి సాయం చేశారు. కొన్ని ప్రాంతాల్లో భోజనాలు ఏర్పాటు చేసి పలు సేవలనూ చేశారు. ఇక వారి సేవలను గుర్తించిన సూర్య తన సోదరుడు కార్తితో కలిసి ఆ ఫ్యాన్స్ అందరి కోసం ఓ స్పెషల్ ట్రీట్​ను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా వారందరికీ స్వయంగా ఆయనే వడ్డించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్​ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఈ సోదరులను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వారి మంచి మనసుకు 'హ్యాట్సాఫ్​ చెప్తున్నారు'.

ఆరు డిఫరెంట్ గెటప్స్​
Suriya Kanguva Movie : ఇక సూర్య అప్​కమింగ్ మూవీస్ విషయానికి వస్తే - ఇటీవలే ఆయన 'కంగువా' అనే భారీ ప్రాజెక్ట్​కు సైన్ చేశారు. డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమలో సూర్య ఆరు డిఫరెంట్ గెటప్స్​లో కనిపించనున్నట్లు సమాచారం. ఐమ్యాక్స్‌, 3డీ వెర్షన్‌లోనూ ఈ ఇది అందుబాటులో ఉండనుంది. దిశా పఠానీ, బాబీ దేవోల్‌ ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కూడా ఈ సినిమాలో ఉన్నారు. టాలీవుడ్ మ్యూజిక్​ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్​ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

'కంగువా' నుంచి క్రేజీ అప్డేట్​- ఏకంగా 38 భాషల్లో రిలీజ్‌!

ఆ స్టార్ హీరో రికార్డు బ్రేక్ చేసిన వీడియో - సూర్య రేంజ్​ అట్లుంటది మరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.