Suriya About Rajinikanth : తన మాటలతో, ఎమోషనల్ స్పీచ్‌లతో ఎంతో మందిని ఇన్స్పైర్ చేశారు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ విషయాన్ని గతంలో ఎంతో మంది సెలబ్రిటీలు చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. అయితే తాజాగా హీరో సూర్య కూడా రజనీ గురించి పలు కీలక విషయాలు మాట్లాడారు. ఇంతకీ సూర్య ఏమన్నారంటే?
సూర్య ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ 'కంగువా' ప్రమోషనల్ ఈవెంట్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన రజనీ గురించి మాట్లాడారు. ఆయన మాట వల్ల కెరీర్ పరంగా తన ఆలోచనలో మార్పొచ్చిందంటూ చెప్పుకొచ్చారు.
"కొన్నాళ్ల క్రితం నేను, రజనీ సర్ కలిసి విమానంలో ప్రయాణించాం. అప్పుడు పలు విషయాల గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు ఆయన 'మీలో స్టార్ మాత్రమే కాదు ఓ మంచి నటుడున ఉన్నాడు. అందుకే ఈ యాక్షన్, కమర్షియల్ చిత్రాలకే పరిమితమై కంఫర్ట్ జోన్‌లో ఉండకండి. అన్ని రకాల సినిమాలను చేయడానికి ప్రయత్నించండి' అంటూ నాతో అన్నారు. అప్పుడు ఆయన అన్న ఆ మాటల వల్లే నేను 'సింగం'లాంటి యాక్షన్ సినిమాల్లో అలాగే 'జై భీమ్'లాంటి లీగల్ డ్రామాలోనూ యాక్ట్ చేయగలిగాను. అయితే రెండు చిత్రాల్లో వైవిధ్యం ఎలా చూపించావ్ అంటూ నా కుమార్తె కూడా నన్ను చాలా సార్లు అడిగింది" అని సూర్య చెప్పుకొచ్చారు.
ఇక ఇదే ఇంటర్వ్యూలో తన అప్‌కమింగ్ ప్రాజెక్టుల గురించి అలాగే సినీ జర్నీ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు సూర్య. ఆ విషయాలు తన మాటల్లోనే
ఆ పాత్రకున్న క్రేజ్ అస్సలు ఊహించలేదు
"విక్రమ్‌లో నేను ప్లే చేసిన రోలెక్స్ పాత్ర చిత్రీకరణ కేవలం ఒక్క పూటలోనే కంప్లీట్ అయ్యింది. ఆ క్యారెక్టర్‌కు నేను ఊహించిన దానికంటే ఎక్కువ క్రేజ్ రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దాని ఆధారంగా ఓ పూర్తి స్థాయి సినిమా మనెందుకు చేయకూడదని నాతో అన్నారు. దాని గురించి, మరోవైపు 'ఇరుంబు కై మాయావి' అనే ప్రాజెక్టు గురించి ఒకట్రెండు సార్లు మేము చర్చించుకున్నాం. కానీ, ప్రస్తుతుం ఇద్దరం వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాం. సమయమే దానికి సమాధానం ఇస్తుందని నేను అనుకుంటున్నాను" అని రోలెక్స్ పాత్ర గురించి సూర్య మాట్లాడారు.
సింగం సిరీస్ గురించి ఆయన్నే అడగాలి
'సింగం' సిరీస్‌లో మరో సినిమా ఎందుకు చేయట్లేదని అని అజిత్ ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు. దానికి డైరెక్టర్ హరి సమాధానం చెప్పాలి. నాకు కూడా అందులో నటించాలని ఎంతో ఆసక్తిగా ఉంది. 'సింగం' చిత్రాలకు విశేష ప్రేక్షకాదరణ దక్కింది. అందుకే ఆ టైటిల్‌ని ఉపయోగించుకుని సింగం 4, సింగం 5 అంటూ వరుసగా సినిమాలు చేయకుండా వాళ్ల అంచనాలకు తగ్గ కథలు అందిస్తాం
తమిళంలో ఇప్పటివరకూ ఇలాంటి సినిమా రాలేదు
కంగువా స్క్రిప్టును నాకు డైరెక్టర్ శివ చెప్పినప్పుడే నేను ఓ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నా అని అనిపించింది. లార్జర్ దేన్ లైఫ్ 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్', 'కల్కి 2898 ఏడీ' లాంటి సినిమాలను మనం ఇప్పటికే చూశాం. ఆ విషయంలో కోలీవుడ్‌లో 'కంగువా'తో మేం తొలి అడుగు వేశాం అని అనుకుంటున్నాను. తమిళంలో ఇప్పటివరకూ ఇటువంటి సినిమా రాలేదు అని సూర్య తెలిపారు.
'రోలెక్స్'కు ఆ సినిమాతో కనెక్షన్స్ - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సూర్య
కమెడియన్ దర్శకత్వంలో హీరో సూర్య కొత్త సినిమా - అఫీషియల్ అనౌన్స్మెంట్