ETV Bharat / entertainment

హైదరాబాద్ రోడ్లపై 'గదర్' హీరో చక్కర్లు - స్టైలిష్ కారు​లో రయ్ రయ్- వీడియో వైరల్ - Sunny Deol - SUNNY DEOL

Sunny Deol Hyderabad: బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ దేఓల్ ప్రస్తుతం టాలీవుడ్ డెరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్​లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో నటుడు సన్ని ఓ స్టైలిష్​ డిజైన్ కారులో హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టారు. ఇది సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

Sunny Deol
Sunny Deol (Source: Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2024, 3:17 PM IST

Sunny Deol Hyderabad: ప్రస్తుతం బాలీవుడ్​ స్టార్​ యాక్టర్స్​ టాలీవుడ్​లో నటించేందుకు ఎలాగైతే ఆసక్తి చూపిస్తున్నారో, అలానే మన టాలీవుడ్​కు చెందిన దర్శకులు కూడా బాలీవుడ్ యాక్టర్స్​తో కలిసి పని చేస్తేందుకు మొగ్గు చూపుతున్నారు. దర్శకుల విషయానికొస్తే ఇప్పటికే సందీప్ వంగా షాహిద్ కపూర్​తో 'కబీర్ సింగ్'​, రణ్​బీర్ కపూర్​తో కలిసి 'యానిమల్' తీసి బ్లాక్ బస్టర్ హిట్స్​ను అందుకున్నారు.

ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్​ గోపీచంద్‌ మలినేని, 'గదర్ 2' చిత్రంతో మళ్లీ సక్సెస్​​ ట్రాక్​ ఎక్కిన బాలీవుడ్ స్టార్​ నటుడు సన్నీ దేఓల్​తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. దీనిని గోపీచంద్​ గ్రాండ్​గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్​ హైదరాబాద్​లో జరుగుతోంది. ఇందులో భాగంగా ఇక్కడే ఉన్న సన్నీ దేఓల్​ సరదాగా హైదరాబాద్​ రోడ్లపై షికార్లు చేశారు. ఓ స్టైలిష్​ డిజైన్ కారులో చార్మినార్​ సహా పలు ప్రాంతాల్లో తిరిగారు. దీనికి సంబంధించిన వీడియోను సన్నీ దేఓల్​ తన ఇన్​ స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది.

ఈ చిత్రంలో సయామీ ఖేర్‌, రెజీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, మైత్రీ మూవీ మేకర్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నారు.

గదర్ 2తో సాలిడ్ కమ్​బ్యాక్
దేశభక్తి బ్యాక్​డ్రాప్​లో ఫాదర్ అండ్​ సన్​ నేపథ్యంలో రూ. 60కోట్ల బడ్జెట్​తో 'గదర్ -2' తెరకెక్కింది. ఈ సినిమాలో సన్నీ దేవోల్‌, అమీషా పటేల్‌ జంటగా కనిపించారు. 2001లో రిలీజైన 'గదర్ ఏక్ ప్రేమ్ కహానీ' సినిమాకు సీక్వెల్​గా డైరెక్టర్ అనిల్‌ శర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. 2023 2023లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. లాంగ్ రన్​లో ఈ సినిమా రూ.600+ కోట్లు వసూల్ చేసింది. కాగా, ఈ సీక్వెల్ విజయంతో త్వరలోనే గదర్‌ 3ను కూడా రూపొందించడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు బీ టౌన్ వర్గాల టాక్.

బుల్లితెరపైకి రూ.600 కోట్ల బ్లాక్ బాస్టర్​ మూవీ - తెలుగు ప్రేక్షకుల కోసం స్పెషల్​గా!

Sunny Deol Villa Auction : 'గదర్ 2' హీరోకు షాక్​.. తన విల్లాను వేలం వేయనున్న బ్యాంక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.