ETV Bharat / entertainment

'డబ్బు కోసమే ఆ సినిమాకు ఒప్పుకున్నా'- సందీప్ ఎమోషనల్​ - సందీప్ కిషన్ లేటెస్ట్ ఇంటర్వ్యూ

Sundeep Kishan Latest Interview : యంగ్ హీరో సందీప్ కిషన్​, వర్ష బొల్లమ్మ లీడ్ రోల్స్​లో రూపొందిన లేటెస్ట్ మూవీ 'ఊరు పేరు భైరవ కోన'. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఫిబ్రవరీ 16న థియేటర్లలోకి రానుంది. అయితే తాజాగా ఈ మూవీ టీమ్ ఓ ప్రమోషనల్ ఈవెంట్​లో పాల్గొంది. అందులో సందీప్ తన ఆర్థిక కష్టాల గురించి చెప్పుకుని ఎమోషనలయ్యారు.

Sundeep Kishan Latest Interview
Sundeep Kishan Latest Interview
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 9:48 PM IST

Sundeep Kishan Latest Interview : తన ట్యాలెంట్​తో ఇటు టాలీవుడ్​తో పాటు అటు కోలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు యంగ్ హీరో సందీప్ కిషన్​. 2010లో తన సినీ జర్నీని ప్రారంభించిన ఈ స్టార్ హీరో అప్పటి నుంచి హిందీ, తెలుగు, తమిళం సినిమాల్లో మెరిశారు. అయితే ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఈ హీరో ఖాతాలో సరైన హిట్ పడటం లేదు. ఇటీవలే మైఖేల్ సినిమాతో సక్సెస్​ అందుకోవాలనుకున్నప్పటికీ సందీప్​కు నిరాశే మిగిలింది. అయితే ఈ సారి మాత్రం కచ్చితంగా హిట్ సాధించాలనే లక్ష్యంతో ఓ సాలిడ్​ సినిమాతో థియేటర్లలోకి రానున్నారు. 'ఊరుపేరు భైరవకోన' అనే థ్రిల్లర్ సినిమాతో ఫిబ్రవరి 16న ప్రేక్షకులను పలకరించనున్నారు.అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాను ఫిబ్రవరీ 14న కొన్ని ఏరియాల్లో రిలీజ్​ చేయనున్నారట.

మరోవైపు సినిమా రిలీజ్ దగ్గర పడుతుందటం వల్ల మూవీ టీమ్ కూడా ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో సందీప్ కిషన్ తన మూవీ టీమ్​తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు మాట్లాడిన ఆయన తన ఆర్థిక కష్టాల గురించి చెప్పుకుని ఎమోషనలయ్యారు.

కరోనా సమయంలో తానూ కష్టలను ఎదుర్కొన్నానంటూ చెప్పిన సందీప్, ధనుశ్​ నుంచి కాల్ వచ్చిన వెంటనే కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పేశానని అన్నారు. డబ్బు కోసమే కొన్ని సినిమాలు చేయాల్సి వచ్చిందని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Ooru Peru Bhairava Kona Cast : థ్రిల్లర్‌, ఫాంటసీ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్​ సమర్పణలో హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా ఈ చిత్రాన్నికి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే విడుదలైన, ట్రైలర్, టీజర్లకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభించింది. ఇందులో కొన్ని పాటలు కూజా సోషల్‌ మీడియాలో తెగ పాపులరయ్యాయి. దీంతో ఈ సినిమా పై ఆడియెన్స్​లో భారీ అంచనాలే ఉన్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ వారం 20 సినిమా/సిరీస్​లు - ఆ మూడు డోంట్ మిస్​!

'గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన' - థ్రిల్లింగ్​గా సందీప్​ మూవీ ట్రైలర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.