ETV Bharat / entertainment

అరుదైన వ్యాథితో సుహాస్ పోరాటం - ఇంతకీ ప్రోసోపాగ్నోసియా ఏంటంటే ? - Suhas New Movie Prasanna Vadanam

Suhas New Movie Prasanna Vadanam : యంగ్ హీరో సుహాస్ తాజాగా 'ప్రసన్న వదనం' అనే నయా కాన్సెప్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవలె ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలైంది. అయితే ఇందులో ఒక అరుదైన సమస్య ఉన్న వ్యక్తిగా కనిపించనున్నారు. ఇంతకీ ఆ వ్యాథి ఏంటంటే ?

Suhas New Movie Prasanna Vadanam
Suhas New Movie Prasanna Vadanam
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 3:18 PM IST

Suhas New Movie Prasanna Vadanam : తాను హీరోగా చేసిన ప్రతి సినిమాలో ఎదో ఒక సామాజిక అంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు యంగ్ హీరో సుహాస్. 'కలర్ ఫోటో' మూవీతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు ఇప్పుడు ప్రసన్న వదనం అనే మూవీతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్​ను విడుదల చేశారు మేకర్స్. ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియో చూస్తుంటే ఆయన ఇప్పటి వరకు మనం వినని ఓ కొత్త కాన్సెప్ట్​తో వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రోసోపాగ్నోసియా ఒక అరుదైన సమస్య ఉన్న వ్యక్తిగా కనిపించనున్నారు.

ఇంతకీ ప్రోసోపాగ్నోసియా ఏంటంటే ?
ప్రోసోపాగ్నోసియా అంటే ఫేస్ బ్లైండ్​నెస్. క్లుప్తంగా చెప్పాలంటే ఈ వ్యాథి ఉన్నవారు తమ ముఖంతో పాటు ఎదుటివారి ముఖాలను గుర్తుపట్టలేరు. తరచూ చూస్తున్నా కూడా వాళ్లను గుర్తించలేరు. సరిగ్గా ఇదే సమస్యతో సతమతమవుతుంటాడు సూర్య (హీరో). మొదట్లో ఈ సమస్యను కామడీగానే చూపించిన మేకర్స్​, ఆ తర్వాత సీరియస్​గా చూపిస్తారు. ఓ హత్యను ప్రత్యక్షంగా చూసిన సూర్య హంతకులని పట్టుకునేందుకు పోలీసులకు సహాయపడాలనుకుంటాడు. కానీ అనుకోకుండా తను మూడు మర్డర్స్​లో ఇరుక్కుంటాడు. అలాంటి వ్యాధితో బాధపడుతున్న సూర్య ఆ కేసుల నుంచి ఎలా బయటపడతాడు? దాని కోసం అతడు పడ్డ కష్టాలేంటి అన్నదే మిగతా స్టోరీ.

ట్రైలర్ చూస్తుంటే సుహాస్ ఎంచుకున్న స్టోరీ చాలా ఆసక్తికంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త కథాంశంతో పాటు హీరో ఛాయిస్​ కూడా బాగుందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాలో సుహాస్ సరసన పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ నటిస్తున్నారు. వీరితో పాటు వైవా హర్ష, నందు, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అర్జున్ వైకె అనే డైరెక్టర్ ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. మే 3న ఈ సినిమా విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పెళ్లికి ముందే గర్భవతి అయితే - సుహాస్ కొత్త సినిమా రివ్యూ - Sriranga Neethulu Review

సుహాస్ కోసం రంగంలోకి సుకుమార్​ - మ్యాటర్ ఏంటంటే? - Suhas Prasanna vadanam

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.