Star Kid Who Lost Blockbuster Movie Chance : కొంత మంది స్టార్ కిడ్స్, ఇండస్ట్రీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ, కెరీర్లో స్థిరపడేందుకు చాలా కష్టపడుతుంటారు. అటువంటి వారు తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకుని రాణిస్తున్న సమయంలో అనుకోని కారణాల వల్ల స్టార్డమ్కు దూరమైన వారు కూడా ఉన్నారు. ఈ కోవకు చెందిన వారే రుస్లాన్ ముంతాజ్. 'స్లమ్ డాగ్ మిలియనీర్' సినిమాలోని ఓ స్పెషల్ రోల్‌ను ఒక్క అడుగు దూరంలో కోల్పోయిన ఈ యంగ్ హీరో ఒక స్టార్ కిడ్ అని చాలా మందికి తెలియకపోవచ్చు.
బాలీవుడ్ సినీ పరిశ్రమలో 80, 90స్లో 'ఖత్రోం కా కిలాడీ', 'దీదార్', 'తిరంగా' లాంటి హిట్ సినిమాల్లో లీడ్ రోల్ పోషించారు అంజనా ముంతాజ్. 1970 నుంచి 2011 వరకూ దాదాపు 100 సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన అంజనా కుమారుడే ఈ రుస్లాన్. 2007లో 'మేరే పెహ్లా పెహ్లా ప్యార్' మూవీతో అరంగ్రేటం చేసిన ఈ యంగ్ స్టార్ 2009లో 'తేరే సంగ్ తో' కాస్త పేరు తెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత రితేశ్ దేశ్‌ముఖ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లీడ్ రోల్స్ లో నటించిన 'జానే కహాన్ సే ఆయీ హై'లో కో యాక్టర్‌గా మెరిశారు.
వీటితో పాటు 2012లో కరిష్మా కపూర్ నటించిన 'డేంజరస్ ఇష్క్'లోనూ కీలక పాత్రలో కనిపించారు. చాలా మందికి తెలియని విషయమేమిటంటే, రుస్లార్‌కు స్టార్ ఇమేజ్ దక్కే అవకాశం కాస్తలో చేజారిపోయింది. బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్ 'స్లమ్ డాగ్ మిలియనీర్' ఫైనల్ ఆడిషన్‌లో ఆయనకు ఛాన్స్ మిస్ అయిపోయింది. ఈ విషయాన్ని ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో ఈ స్టార్ హీరో వెల్లడించారు.
"నేను ఫస్ట్ టైమ్ ఆడిషన్ ఇచ్చినప్పుడు సన్నగా ఉండేవాడిని. స్లమ్‌డాగ్ మిలియనీర్ నిర్మాతలు అనుకున్న క్యారెక్టర్ కు చాలా దగ్గరగా అనిపించానట. అయితే కొందరిని పరిశీలనలో ఉంచి నాలుగు నెలల తర్వాత మరోసారి ఆడిషన్ చేయాలని పిలిపించారు. కానీ నేను కాస్త కండ పట్టి వేరే లుక్‌కి మారిపోయాను. డిఫరెంట్‌గా కనిపించేసరికి వాళ్లు నన్ను తీసుకోలేదు" అంటూ తాను చేజార్చుకున్న అవకాశాన్ని గుర్తు చేసుకున్నారు రుస్లాన్.
ఆ తర్వాత 'జబారియా జోడీ', 'యే సాలీ ఆషిఖీ', 'ధాక్' సినిమాల్లో నటించారు. కొన్నిసార్లు మనం ఊహించినంత దక్కకపోయినా వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటూ పోవాలంటూ మెసేజ్ ఇస్తున్నారు రుస్లాన్.
కెరీర్లోలో 180 ఫ్లాపులు! - అయినా ఇప్పటికీ ఆ హీరో సూపర్ స్టారే! - Most Flops Hero