ETV Bharat / entertainment

23 ఏళ్ల రాజమౌళి ఫ్లాప్​ సెంటిమెంట్​కు ఎన్టీఆర్​​ బ్రేక్ - ఏ రోజైతో మొదలైందో అదే రోజు క్లోజ్! - Rajamouli Flop Sentiment Devara - RAJAMOULI FLOP SENTIMENT DEVARA

Devara break Rajamouli Flop Sentiment : ఎన్టీఆర్ దేవర సినిమా తొలి షో నుంచే పాజిటివ్ టాక్​తో దూసుకెళ్తోంది. దీంతో 23 ఏళ్ల రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్​కు బ్రేక్ పడినట్టైంది! ఈ విషయాన్ని జక్కన్న కొడుకు కార్తికేయ ట్వీట్ చేశాడు.

source ETV Bharat
Rajamouli NTR (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2024, 9:13 AM IST

Devara break Rajamouli Flop Sentiment : దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తే ఇండస్ట్రీ హిట్ లేదా బ్లాక్ బస్టర్ హిట్ అన్న సంగతి తెలిసిందే. అందుకే ఏ హీరో అయినా సరే జక్కన్నతో సినిమా చేయాలని ఆశిస్తుంటారు. కానీ రాజమౌళితో సినిమా చేశాకే ఆ హీరోకు అసలు పరీక్ష మొదలవుతుంది. ఎందుకంటే జక్కన్నతో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కూడా ఇప్పటివరకు వెంటనే హిట్​ కొట్టిన సందర్భం లేదు. ప్రతి హీరో డిజాస్టర్​తో బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినవారే. ఇది స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి వస్తున్న ఆనవాయితిగా, ఓ సంప్రదాయంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే ఓ మిత్‌లాగా ఉండిపోయింది. రాజమౌళితో సినిమా చేస్తే సదరు హీరోకి నెక్ట్స్ పక్కా డిజాస్టర్ అని అందరి మదిలో ఫిక్స్ అయిపోయింది.

కానీ ఇప్పుడా మిత్‌ను యంగ్​ టైగర్​ ఎన్టీఆర్ బ్రేక్ చేసేశారు. రాజమౌళి దర్శకత్వంలో తారక్ నటించిన స్టూడెంట్ నెం.1 సెప్టెంబర్ 27, 2001న విడుదలైంది. ఇప్పుడు దేవర కూడా సెప్టెంబర్ 27నే రిలీజ్ అయింది. అలా రాజమౌళి మిత్​ను ఎన్టీఆర్​కు బ్రేక్​ చేయడానికి 23 ఏళ్లు పట్టింది. అంటే ఈ మిత్​ 23 ఏళ్ల కిందట ఏ హీరోతో మొదలైందో, ఏ రోజు మొదలైందో, మళ్లీ ఇప్పుడు ఇన్నాళ్లకు అదే హీరోతో, అదే రోజుతో ముగిసింది. దీంతో ఎన్టీఆర్​ రాజమౌళి మిత్​ను బ్రేక్ చేశారని సోషల్ మీడియాలో కామెంట్లు చక్కర్లు కొడుతున్నాయి.

ఇదే విషయాన్ని రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా ట్వీట్ చేశాడు. "ఫైనల్​గా 23 ఏళ్ల మిత్‌ను బ్రేక్ అయింది. అది కూడా ఏ వ్యక్తితో ఏ రోజు అయితే మొదలైందో మళ్లీ అదే రోజు అదే వ్యక్తితో బద్దలైంది. చిన్నప్పటి నుంచి ఆయన్ను ఎంతో దగ్గరగా, ఆయన ఎదుగుదల, సక్సెస్​ను చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయన చేసిన అద్భుతాలను చూస్తున్నాను. తెలుగు సినిమాకు ఆయన చేస్తున్న కృషిని చూస్తూ ఉన్నాను. నాకు అస్సలు మాటలు రావడం లేదు. ఫ్యాన్స్ అందరు సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఇది. దేవర ది బిగ్గెస్ట్ మాస్ సెలెబ్రేషన్స్ ఇన్​ సినిమా. ఇక ఇప్పుడు మ్యాడ్​నెస్​ కూడా మాట్లాడుతుంది. ఆల్ హెయిల్ ది టైగర్" అంటూ ఎన్టీఆర్‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు.

Devara Movie Review : కాగా, ఎన్టీఆర్ నటించిన దేవర తొలి షో నుంచే మంచి హిట్ టాక్ అందుకుంది. కొన్ని చోట్ల మాత్రమే చిన్న నెగెటివ్ టాక్ వినిపించింది. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని అంతా అంటున్నారు. కాకపోతే సెకండాఫ్ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేదని, చివరి ట్విస్ట్ సింపుల్​గా ఉందని చెబుతున్నారు. అయినప్పటికీ సినిమా మొత్తం బాగానే ఉందని రివ్యూలు ఇస్తున్నాయి.

టాలీవుడ్​పై 'దేవర' విలన్ సైఫ్​​ కీలక కామెంట్స్ - ఆ విషయంలో కొరటాల బాగా హెల్ప్ చేశారట! - Saif Alikhan Devara Movie

ఎన్టీఆర్​ 'దేవర' మూవీ రివ్యూ - ఎర్ర సముద్రం పోటెత్తింది! - DEVARA MOVIE REVIEW

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.