ETV Bharat / entertainment

అయ్యో శ్రీలీల - మరో ఆఫర్ చేజారే? - Sreeleela - SREELEELA

Sreeleela Robinhood Movie : వరుస సినిమాలతో బిజిబిజీగా గడిపిన శ్రీలీల ప్రస్తుతం వరుసగా సినిమాల నుంచి వైదొలుగుతోంది. తాజాగా మరో సినిమా నుంచి ఆమె ఔట్ అయినట్లు తెలిసింది. పూర్తి వివరాలు స్టోరీలో.

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 10:07 PM IST

Updated : Apr 16, 2024, 10:18 PM IST

Sreeleela Robinhood Movie : సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలో టాలీవుడ్ అగ్రహీరోలైన రవితేజ, బాలకృష్ణ, మహేశ్ బాబుల లాంటి పెద్ద పెద్ద హీరోలతో స్క్రీన్ పంచుకున్న హీరోయిన్ శ్రీలీల. మొన్నటి దాకా వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపిన ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. తన డ్యాన్స్​ అండ్ క్యూట్ యాక్టింగ్​తో ప్రతి ఒక్కరినీ వాహ్! అనిపించేలా చేసిన శ్రీలీల చేతి నుంచి సినిమాలు వరుసగా చేజారుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా శ్రీలీల అభిమానులకు మరో షాక్ తగిలింది. ఆమె చేతి నుంచి మరో సినిమా వెళ్లిపోయినట్లు సమాచారం అందింది.

అదేంటంటే "రాబిన్ హుడ్". నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్వకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మొదట రష్మికను హీరోయిన్​గా తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె స్థానంలో శ్రీలీల నటిస్తున్నట్లుగా సమాచారం అందింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి శ్రీలీలను కూడా ఔట్ అయిందని తెలిసింది. ఈమె స్థానంలో రాశీ ఖన్నాను ఫైనల్ చేశారనీ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై "రాబిన్ హుడ్" టీం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ రాలేదు. కాగా, ఇప్పటికే నితిన్-శ్రీలీల కలిసి ఎక్స్​ట్రార్డినరీలో నటించిన సంగతి తెలిసిందే.

అంతకుముందు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ- జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోను శ్రీలీలను హీరోయిన్​గా అనుకున్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆ సినిమాలో విజయ్ సరసన శ్రీలీల నటించడం లేదని తెలిసింది. ఆమె స్థానంలో తాజాగా రిలీజైన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ప్రేమలు సినిమాలో నటించిన మమితా బైజును తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే ప్రస్తుతానికి శ్రీలీల చేతిలో ఉన్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే. ఇది కూడా పవన్ రాజకీయాలతో బిజీగా ఉన్న కారణంగా తాత్కలికంగా నిలిచిపోయింది. మరి షూటింగ్ మొదలయ్యే సమయానికి ఇందులో శ్రీలీలనే హీరోయిన్‌గా ఉంటుందనే నమ్మకం పెద్దగా కనిపించడం లేదు. దీంతో పాటు ప్రభాస్ - హనురాఘపూడి తీయబోయే లవ్ స్టోరీలో శ్రీలీల కనిపించే అవకాశం ఉందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే ఈ మూవీ అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.

బాగా ఫీలైన అవంతిక వందనపు - ఏం జరిగిందంటే? - Avantika Vandanapu on Trolls

నాని రికార్డ్​ను బ్రేక్ చేసిన టిల్లన్న - ఇక మిగిలింది దేవరకొండనే! - Tillu Square Collections

Last Updated : Apr 16, 2024, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.