ETV Bharat / entertainment

మాట నిలబెట్టుకున్న శ్రీలీల - ఆ స్టార్ హీరో సినిమాకు నో! - Vijay Thalapathy Sreeleela - VIJAY THALAPATHY SREELEELA

స్టార్ హీరోయిన్ శ్రీలీల ఆ బడా హీరో సినిమాకు నో చెప్పిందని తెలుస్తోంది. పూర్తి వివరాలు స్టోరీలో.

మాట నిలబెట్టుకున్న శ్రీలీల - ఆ స్టార్ హీరో సినిమాకు నో!

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 5:00 PM IST

Vijay Thalapathy Sreeleela : త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న విజయ్ దళపతి తన పెండింగ్​ మూవీ ప్రాజెక్ట్స్​ను పూర్తిచేసుకుని రాజకీయాలలోకి వస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. దీనితో అయన నటించే చివరి రెండు సినిమాలపై ఫ్యాన్స్​ విపరీతమైన క్రేజ్ పెంచుకున్నారు. ఆ రెండు ఫిల్మ్స్ లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న గోట్ ఒకటి. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీలకు ఒక స్పెషల్ సాంగ్ చేసే అవకాశం వచ్చిందట. కానీ ఈ భామ దానికి నో చెప్పిందని కథనాలు వస్తున్నాయి.

టాలీవుడ్​లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న శ్రీలీల కోలీవుడ్ లో మాత్రం ఆచి తూచి అడుగులు వేయాలని అనుకుంటుందట. ఇప్పటికే కోలీవుడ్ టాప్ హీరో అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం అందింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీకి మార్క్ ఆంటోనీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.

కోలీవుడ్​లో అజిత్ సరసన శ్రీలీల గ్రాండ్ ఎంట్రీ ఇస్తే అది కచ్చితంగా ఆమె కెరీర్​కు సహాయపడుతుంది. అందుకే గోట్ సినిమాలో స్పెషల్ సాంగ్ కి నో చెప్పిందని ఇండస్ట్రీలో కొందరు అభిప్రాయ పడుతున్నారు. పైగా శ్రీలీల ఇదివరకే కొన్ని ఇంటర్వ్యూలలో తను స్పెషల్ సాంగ్స్ చేయనని చెప్పింది. అందుకే గోట్​ మూవీకి నో చెప్పిందని మరికొందరు అంటున్నారు.

ఏదేమైనా టాలీవుడ్ వరుస అవకాశాలు ఎలా అయితే శ్రీలీలకు వస్తున్నాయో ఆ రేంజ్​లో హిట్స్ మాత్రం రావడంలేదు. గత ఏడాది చాలా మూవీస్​లో ముందు పెట్టుకున్న వారిని తీసేసి మరీ శ్రీలీలకు అవకాశం ఇచ్చేవారు. కానీ ఈ ఏడాదికి పరిస్థితి మారింది. ఇప్పుడు శ్రీలీల ముందే ఒప్పుకున్న ప్రాజెక్ట్స్​లోనూ కొత్తగా వస్తున్న మలయాళ భామలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం తెలుగులో శ్రీలీల చేతిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే ఉంది. అయితే ఆ మూవీ షూటింగ్ కూడా ఎన్నికల వల్ల వాయిదా పడింది.

OTTలోకి ప్రేమలు భామ మమితా బైజు కొత్త సినిమా - రొమాంటిక్ కామెడీ ఎంటర్​టైనర్​గా! - Premalu Heroine Mamitha Baiju

ఈ వారం అందరి ఫోకస్​ ఆ 5 చిత్రాలపైనే! - This week Movie Releases

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.