ETV Bharat / entertainment

'నేను ఇండస్ట్రీకి తీసుకొచ్చింది అదొక్కటే - నా కంటే వాళ్లే ఎక్కువ కష్టపడుతారు' - Sreeleela Latest Interview - SREELEELA LATEST INTERVIEW

Sreeleela Latest Interview : శ్రీలీల అంటే మనకు ఠక్కున గుర్తొచ్చేది డ్యాన్స్​. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే ఈ బ్యూటీ, హీరోలకు దీటుగా డ్యాన్స్ చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఓ యాంకర్ తన డ్యాన్స్​ గురంచి ఓ ప్రశ్న అడిగారు. అదేంటంటే ?

Sreeleela Latest Interview
Sreeleela Latest Interview
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 7, 2024, 6:52 AM IST

Updated : Apr 7, 2024, 11:35 AM IST

Sreeleela Latest Interview : యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం జోరు తగ్గించారు. అయినప్పటికీ తన క్రేజ్ ఇంకా అలానే ఉంది. 'పెళ్లి సందడి' సినిమా నుంచి మొదలైన తన సినీ జర్నీ ఇప్పటి వరకు మంచి మంచి ఆఫర్లను తెచ్చిపెట్టింది. తన సినిమాలు బాక్సాఫీస్​ వద్ద మిక్స్​డ్ టాక్ అందుకున్నప్పటికీ ఈ బ్యూటీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తన యాక్టింగ్​కే కాదు డ్యాన్స్​కు కూడా ఫ్యాన్​ ఫాలోయింగ్​ ఉంది. 'ధమాకా', 'గుంటూరు' కారం లాంటి మూవీస్​లో ఈ అమ్మడు హీరోలకు దీటుగా డ్యాన్స్ వేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆన్​స్క్రీన్​పైనే కాకుండా ఆఫ్​స్క్రీన్​లోనూ మంచి డ్యాన్సర్​గా పేరొందారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఓ యాంకర్ తన డ్యాన్స్​ గురంచి ఓ ప్రశ్న అడిగారు.

"మీరు చేసే డ్యాన్సుల గురించి కాంప్లిమెంట్స్ విన్నప్పుడు మీకు గర్వంగా అనిపిస్తుందా? అని అడగ్గా, "చిన్నప్పటి నుంచి డ్యాన్స్​పై మక్కువ పెంచుకున్నాను. నా ఇంట్రెస్ట్​ను, అభిరుచిని మా అమ్మ ఎంతగానో ప్రోత్సహించారు. ఒక రకంగా డ్యాన్స్‌ పరంగా ఇప్పుడు నాకొస్తున్న గుర్తింపంతా మా అమ్మ, నా గురువుల వల్లనే. నాతో పాటు నేను ఈ ఇండస్ట్రీకి తీసుకొచ్చింది డ్యాన్స్​, ఆ పెర్ఫామెన్స్​లతో వచ్చిన కాన్ఫిడెన్సే. అదే నా బలం అని నమ్మి, ఒకొక్క సినిమాతో పలు విషయాలను నేర్చుకుంటూ అడుగులేస్తున్నాను. నా డ్యాన్స్​ల కంటే కూడా, హీరోలు ఫైట్స్‌ కోసం పడే కష్టమే ఎక్కువ. సెట్స్‌లో వాళ్లు పెట్టే ఎఫర్ట్​ చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు వాళ్లపై మరింత గౌరవం పెరిగింది" అని రిప్లై ఇచ్చారు శ్రీ లీల.

ఇక శ్రీలీల ఇటీవలే 'గుంటూరు కారం' సినిమాలో మెరిశారు. ఇందులోనూ తన డ్యాన్స్​కు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా 'కుర్చి మడతపెట్టి' సాంగ్​లో తన పెర్ఫామెన్స్​కు వరల్డ్​వైడ్​ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్​ రోల్​లో రూపొందుతున్న 'ఉస్తాద్ భగత్​సింగ్​' సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటు తన చదువును కూడా కొనసాగిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సినిమాల్లోనే కాదు ఈ ముద్దుగుమ్మలు చదువుల్లోనూ టాపే! - Celebrities Educational Background

నాకు అలాంటోడే కావాలి అంటున్న శ్రీలీల - మీలో ఎవరైనా అలా ఉన్నారా?

Last Updated : Apr 7, 2024, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.