ETV Bharat / entertainment

ఓటీటీలోకి 'శ్వాగ్​' మూవీ - ఎక్కడ స్ట్రీమ్ అవుతోందంటే?

ఓటీటీలోకి శ్రీ విష్ణు లేటెస్ట్ మూవీ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sree Vishnu Swag Movie OTT
Sree Vishnu Swag Movie (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Sree Vishnu Swag Movie OTT Release : యంగ్ హీరో శ్రీ విష్ణు, రీతూ వర్మ లీడ్ రోల్స్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'శ్వాగ్​'. డిఫరెంట్​ కాన్సెప్ట్​తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మిక్స్​డ్​ టాక్​తో సరిపెట్టుకుంది. అయితే ఇప్పుడీ చిత్రం ఓటీటీలోనూ సందడి చేసేందుకు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రస్తుతం స్ట్రీమ్ అవుతోంది. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా వెల్లడించారు. సినిమాకు ఆశించిన స్థాయిలో టాక్ రానప్పటికీ, ఇందులో శ్రీ విష్ణు యాక్టింగ్​కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

స్టోరీ ఏంటంటే?
1551లో శ్వాగణిక వంశానికి చెందిన రాజు(శ్రీ విష్ణు) మాతృస్వామ్య కుటుంబంలో అణిగిమణిగి ఉంటాడు. అతడు పురుషుడి ఆధిపత్యం కోసం ఆరాట పడుతుంటాడు. తన వారసత్వం కొనసాగాలని భావిస్తాడు. అనుకున్నట్టే వారసుడు పుట్టడం వల్ల తన హయాం నుంచి పితృస్వామ్యం పరంపరను కొనసాగిస్తాడు. అయితే యయాతి, భవభూతి, సింగరేణి అలియాస్ సింగ (శ్రీవిష్ణు) - వీరంతా ఆ కుటుంబానికి చెందిన భిన్న తరాల వ్యక్తులే. యయాతి, భవభూతి పురుషాధిక్యం కోసం చేసిన ప్రయత్నాలతో ఆ కుటుంబంతో ఒకరితో మరొకరికి సంబంధాలు తెగిపోతాయి. అయితే ఈ వంశానికి చెందిన ఖజానా దక్కాలంటే నేటి తరానికి చెందిన వారసుడు ఎక్కడున్నాడో కనిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో ఎస్.ఐ.భవభూతి చేసిన ప్రయత్నం ఫలించిందా? ఖజానా ఎవరికి దక్కింది? ఈ కథలో విభూతి ఎవరు? నిజమైన వారసత్వం అంటే ఏమిటి? ఇటువంటి తెలియాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.

కాగా, ఈ సినిమాలో హీరో విష్ణు ఒకే కుటుంబానికి చెందిన నాలుగు పాత్రల్లో నటించారు. ఇక సీనియర్ నటుడు సునీల్, శరణ్య ప్రదీప్, రవిబాబు, గెటప్ శ్రీను, పృథ్వీ రాజ్, కీరిటీ తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. హసిత్​ గోలీ రచించి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ చక్కటి సంగీతాన్ని అందించారు.

నేను పరిచయం చేసిన దర్శకులే నా ఆస్తి: శ్రీ విష్ణు

ఇప్పటికీ అలా చేయాలంటే సిగ్గు: శ్రీ విష్ణు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.