ETV Bharat / entertainment

'స్క్విడ్​గేమ్' లాంటి అడ్వెంచర్స్​- నెట్​ఫ్లిక్స్​లో ఉన్న టాప్ 10 మూవీస్ ఇవే - Squid Game Type Movies Hollywood - SQUID GAME TYPE MOVIES HOLLYWOOD

Squid Game Type Movies: ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ నెట్​ఫ్లిక్స్​లో అందుబాటులో ఉన్న 'స్క్విడ్ గేమ్' లాంటి ఇంట్రెస్టింగ్ సినిమాల లిస్ట్ ఇదే!

Squid Game Type Movies
Squid Game Type Movies
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 22, 2024, 8:34 PM IST

Squid Game Type Movies: కొరియన్ సిరీస్​ 'స్క్విడ్ గేమ్' ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారీ నగదు బహుమతి గెలుచుకునే అవకాశం కోసం 456 మంది ఆటగాళ్లు వారి ప్రాణాలను పణంగా పెట్టి గేమ్ ఆడతారు. ఈ గేమ్ ఆడే ప్రక్రియలో సిరీస్​ ప్రతి క్షణం ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్​కు అందుబాటులో ఉంది. ఇక ఇదే నేపథ్యంలో సాగే ఈ సిరీస్​కు నెట్​ఫ్లిక్స్​లో చాలానే ఉన్నాయి. అందులోని టాప్- 10 సినిమాలు ఇవే!

  • The Wailing: ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక ఊరిలోకి ప్రవేశించిన తర్వాత జరిగిన పరిణామాలు ఒక మిస్టరీగా మారతాయి. తన కూతురిని కాపాడడం కోసం ఆ కేసును ఛాలెంజ్ గా తీసుకుంటాడు ఒక పోలీసు అధికారి.
  • Time to Hunt: ఈ సినిమాలో సౌత్ కొరియా ఆర్ధిక కష్టాల్లో మునిగిపోయినట్టు చూపిస్తారు. పేదరికంలో ఉన్న కొంతమంది స్నేహితులు సుఖంగా బ్రతకాలి అనుకుంటారు. అయితే ఈలోగా వారిని ఒక వ్యక్తి వెంబడించడం మొదలుపెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే Time to Hunt చూడాల్సిందే.
  • Closed School: 2019లో రిలీజైన ఈ హారర్ సినిమాలో కొంతమంది హై స్కూల్ స్టూడెంట్స్ లోపల ఉండగా స్కూల్ కూలిపోతుంది. ఆ తర్వాత భయంకరమైన సంఘటనలు జరుగుతాయి.
  • Seol Station: ఇది ఒక యానిమేటెడ్ హారర్ సినిమా. 2016లో రిలీజైన ఈ సినిమాలో జాంబి విజృంభణ జరిగిన తర్వాత కొంతమంది తమను తాము ఈ జాంబిల నుండి కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం ఈ సినిమా కథ.
  • The Outlaws: 2007లో మొదటి భాగం, 2022లో రెండవ భాగం వచ్చింది. ఒక రెండు గ్రూపుల మధ్య జరిగే యుద్దం ఈ సినిమా కథాంశం.
  • Smugglers: ఈ సినిమా కథ అంతా 1970ల్లో జరుగుతుంది. ఒక ప్రశాంతమైన ఊరులో ఇద్దరూ ఆడవాళ్లు స్మగ్లింగ్ కేసులో ఇరుక్కుంటారు. ఈ సినిమా 2023లో రిలీజ్ అయింది.
  • I Saw the Devil: ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కూతురు ఒక సైకో చేతిలో హత్యకు గురి అవుతుంది. ఆ అమ్మాయికి కాబోయే భర్త ఆ హత్యకు పగ తీర్చుకోవాలని అనుకుంటాడు.
  • The Swindlers: ఒక పెద్ద పేరున్న వ్యక్తిని పట్టుకోవడానికి విభిన్న పరిస్థితుల నుండి వచ్చిన ఇద్దరూ కలుస్తారు. వాళ్ల లక్ష్యాన్ని ఎలా సాధించారు అన్నదే ఈ సినిమా కథ.
  • Cold Eyes: బ్యాంక్ ను దోచుకున్న దొంగలని పట్టుకోవడానికి ఒక స్పెషల్ పోలీస్ టీం చేసిన ప్రయత్నం ఈ సినిమా కథ.
  • The Thieves: ఈ సినిమాలో కొంతమంది దొంగలు ఒక కాసినోలో ఉన్న ఖరీదైన డైమండ్ ను దొంగలించాలని ప్లాన్ చేస్తారు. అయితే మరొకరు కూడా అదే రకమైన ప్లాన్ ను అమలుచేస్తారు.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

మిస్టరీ, సస్పెన్స్ కథలంటే ఇష్టమా - తెలుగులో చూడాలనుకుంటున్నారా? - అయితే ఇది మీ కోసమే! - Mystery Thriller Telugu Web Series

తెలుగులోనూ హర్రర్ సినిమాల జోరు- టాప్ 10 మూవీస్ లిస్ట్ ఇదే- మీరేం చూస్తారు? - Telugu Top 10 Horror Movies OTT

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.