ETV Bharat / entertainment

కూతురు వయసున్న మోడల్‌తో 'స్పైడర్ మ్యాన్' హీరో డేటింగ్! - SpiderMan Hero Dating - SPIDERMAN HERO DATING

SpiderMan Hero Tobey Maguire Dating : 49 ఏళ్ల స్పైడర్ మ్యాన్ హీరో తన కూతురు కన్నా మూడేళ్లు పెద్దదైన 20 ఏళ్ల మోడల్​తో డేటింగ్ చేస్తున్నారని జోరుగా రూమర్స్​ వస్తున్నాయి. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
SpiderMan Hero Tobey Maguire Dating (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 9, 2024, 4:26 PM IST

SpiderMan Hero Tobey Maguire Dating : హాలీవుడ్ సూపర్ హీరో సినిమాల్లో స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే ఈ ఫ్రాంచైజీలో వచ్చిన 1, 2, 3 భాగాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హీరో టోబే మాగైర్. ఇప్పుడీ స్టార్​ హీరో తన 49ఏళ్ల వయసులో, తన కూతురు కన్నా మూడేళ్లు పెద్దదైన 20 ఏళ్ల మోడల్ లిలీ చీతో డేటింగ్ ఉన్నారని జోరుగా రూమర్స్​ వస్తున్నాయి.

అయితే తాజాగా ఈ విషయమై టోబే మాగైర్ మాజీ భార్య జెన్నిఫర్ మేయర్ స్పందించారు. ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. "మీ మాజీ భర్త మీ కూతురు కన్నా మూడేళ్లు పెద్దదైన అమ్మాయితో డేటింగ్ ఎందుకు చేస్తున్నారు?" అని అడగగా దానికి జెన్నిఫర్ మేయర్ దీటుగా సమాధానమిచ్చారు.

"సాధారణంగా నేను ఇలాంటి నాన్సెన్స్ వార్తలకు స్పందించను. కానీ అతడు కేవలం తన స్నేహితురాలికి సాయం చేస్తున్నాడు. అతడు చాలా మంచోడు. ఎంతో దయగలిగిన వాడు. కానీ ఇప్పుడు ఎలాంటి సంబంధం లేని విషయంలో అతడిపై డైటింగ్ రూమర్స్ వచ్చాయి. అయినా మీ రూడ్ కామెంట్‌కు ధన్యవాదాలు. ఈ విషయం ఈరోజు మీకు సంతోషాన్ని కలిగించిందని నేను ఆశిస్తున్నాను. మీపై ప్రేమతో మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను" అని రిప్లై ఇచ్చింది. ఇకపోతే ఈ విషయమై టోబే, లిలీ మాత్రం స్పందించలేదు.

న్యూయార్క్‌లోని ఓ వేడుకలో టోబీ మాగైర్, లిలీ చీ కలిసి కనిపించారు. తామిద్దరు కలిసి దిగిన పిక్స్​ను లిలీ సోషల్​ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పిక్స్​లో లిలీ నడుముపై టోబే చేతులు వేసి కాస్త సన్నిహితంగా కనిపించారు. పైగా ఇద్దరూ సేమ్​ కలర్​ డ్రెస్​లోనే కనిపించారు. దీంతో ఈ డేటింగ్ రూమర్స్‌ వచ్చాయి.

ఇక టోబే - జెన్నిఫర్ విషయానికొస్తే 2007లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. 9ఏళ్ల తర్వాత 2016లో తమ బంధానికి ముగింపు పలికారు. అనంతరం నాలుగేళ్ల తర్వాత 2020లో విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు 17 ఏళ్ల కుమార్తె రూబీ స్వీట్ హార్ట్ మాగైర్, 14 ఏళ్ల కుమారుడు ఓటిస్ తోబియాస్ ఇద్దరు పిల్లలు ఉన్నారు.

'Mirzapur 4' సూపర్​ అప్డేట్​ - వర్క్​ ఎక్కడి దాకా వచ్చిందంటే?

ఒకప్పుడు రూ.90 కోట్ల అప్పులు! - ఇప్పుడు 'కల్కి'తో హాట్​టాపిక్​గా మారిన నటుడెవరంటే? - Kalki 2898 AD Movie

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.