ETV Bharat / entertainment

బాలీవుడ్ వర్సెస్​ సౌత్ ఇండస్ట్రీ - ఐకాన్ స్టార్​ రియాక్షన్ ఇదే - South Industry VS Bollywood

South Industry VS Bollywood Allu arjun : సోషల్‌ మీడియాలో సౌత్‌ ఇండస్ట్రీ వర్సెస్‌ బాలీవుడ్‌ అంటూ చాలా కాలంగా వార్ జరుగుతూ ఉందన్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఏం అన్నారంటే?

సౌత్ వర్సెస్​ నార్త్ ఇండస్ట్రీ - అలాంటి కామెంట్స్ చేసిన ఐకాన్ స్టార్​

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 14, 2024, 8:19 PM IST

Updated : Mar 14, 2024, 8:33 PM IST

South Industry VS Bollywood Allu arjun : సాధారణంగా సినీ రంగంలో ఒక ఇండస్ట్రీకి మరొక ఇండస్ట్రీకి పోటీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. నెట్టింట్లో అయితే ఈ పోటీకి సంబంధించిన టాపిక్‌ ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే కొనసాగుతుంటుంది. అలా సౌత్‌ ఇండస్ట్రీ వర్సెస్‌ బాలీవుడ్‌ అంటూ చాలా కాలంగా వార్ జరుగుతోంది. ఎందుకంటే గత కొద్ది కాలంగా టాలీవుడ్​ తన స్థాయిని పెంచుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అదే సమయంలో బాలీవుడ్​ సక్సెస్ రేట్ లేక డీలా పడుతూ వస్తోంది. ఒకటి రెండు సినిమాలు మినహా బాక్సాఫీస్​ ముందు అన్నీ ఫ్లాప్​లే వస్తున్నాయి. దీంతో ఈ సౌత్‌ ఇండస్ట్రీ వర్సెస్‌ బాలీవుడ్‌ టాపిక్​పై సినీ ప్రముఖులు వరుసగా స్పందిస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా దీనిపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఆరు దశాబ్ధాల పాటు హిందీ పరిశ్రమ మంచి సినిమాలతో ఆడియెన్స్​ను అలరించింది. ప్రస్తుతం అక్కడ సక్సెస్​ రేట్‌ తగ్గిందని పరిశ్రమను విమర్శించడం సరైన విషయం కాదు. సౌత్ ఇండస్ట్రీ, నార్త్ ఇండస్ట్రీ అన్న తేడా లేదు. రెండు కూడా సోదర భావంతో గౌరవించుకుంటున్నాయి. దక్షిణాది చిత్రాల ప్రభావం హిందీపై ఉన్నట్లు అక్కడి చిత్రాల ప్రభావం కూడా ఇక్కడ ఉంటుంది అని ఐకాన్​ స్టార్ అన్నారు.

Allu Arjun Pushpa 2 Movie Budget : కాగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప : ది రూల్‌లో నటిస్తున్నారు. 2021లో విడుదలై సూపర్‌ హిట్‌ అందుకున్న పుష్ప : ది రైజ్‌కు కొనసాగింపుగా ఈ చిత్రం వస్తోంది. దీని కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు సుకుమార్‌ ఈ చిత్రాన్ని గ్రాండ్​గా తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్​ అని అంటున్నారు. రష్మిక హీరోయిన్​గా నటిస్తోంది. మలయాళ స్టార్ ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయ, సునీల్‌, అనసూయ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15న సినిమా రిలీజ్​ కానుంది(Pushpa 2 Release Date).

ఆ రియాల్టీ షోకు హోస్ట్​గా స్టార్ డైరెక్టర్ - ఏకంగా అన్ని కోట్ల రెమ్యునరేషన్!

ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన 'జాతి రత్నాలు' ఫరియా అబ్దుల్లా!

Last Updated : Mar 14, 2024, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.