ETV Bharat / entertainment

'అది నా పర్సనల్, మీకు అనవసరం' - పెళ్లి రూమర్స్​పై సోనాక్షి సిన్హా ఫైర్​ - Sonakshi Sinha Marriage - SONAKSHI SINHA MARRIAGE

Sonakshi Sinha Marriage : బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోనాక్షి తన పెళ్లిపై స్పందించారు. తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దంటూ మీడియా ముందు మండిపడ్డారు.

Source Getty images and ANI
sonakshi sinha (Source Getty images and ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 12, 2024, 5:40 PM IST

Sonakshi Sinha Marriage : రీసెంట్​గా 'బడే మియా చోటే మియా', 'హీారామండీ' చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించిన సోనాక్షి సిన్హా అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఆమె ఈ వార్తలను తోసిపుచ్చింది. తన స్టైల్‌లో మరోసారి మీడియాపై విరుచుకుపడింది. రీసెంట్‌గా రిలీజ్ అయిన సినిమా ముచ్చట్లు పంచుకుంటూనే పర్సనల్ విషయాలపై ప్రస్తావించొద్దంటూ సీరియస్ అయింది. కొన్నాళ్లుగా తనకు, తన బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇఖ్బాల్‌కు మధ్య సాగుతున్న ప్రేమ వ్యవహారంపై స్పందించడానికి నిరాకరించింది. మొత్తంగా జూన్ 23న ముంబయిలోని ఓ ప్రైవేట్ ప్లేస్‌లో వీరిద్దరూ ఒకటవుతున్నారని వస్తున్న వార్తలపై క్లారిటీ ఇవ్వకుండానే దాటేసింది.

"ముందుగా చెప్పాలంటే ఇది మీకెవ్వరికీ సంబంధించిన విషయం కాదు. ఇది నా వ్యక్తిగత విషయం మాత్రమే. ఎందుకని అందరూ అంత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారో నాకు తెలియడం లేదు. నా పేరెంట్స్ కన్నా ఎక్కువగా పెళ్లి ఎప్పుడంటూ విసిగిస్తున్నారు. ఇది నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. వారి ఆత్రం చూస్తుంటే నవ్వొస్తుంది కానీ, నాకు అది పెద్ద మ్యాటర్ లా అనిపించడం లేదు. ఏం చేయగలం చెప్పండి" అంటూ మాట మార్చేసింది.

నేను ఎదురుచూస్తున్నా - సోనాక్షి పెళ్లి జరగబోతుందంటూ వస్తున్న వార్తలపై స్పందించాలని ఆమె తండ్రి యాక్టర్, పొలిటీషియన్ అయిన శత్రుఘ్న సిన్హాను అడగ్గా ఇలా బదులిచ్చారు. "నాతో చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లందరూ ఇదే మాట అడుగుతున్నారు. మీడియా కంటే ఎక్కువగా నాకేం తెలుసు. ఇవాళ జనరేషన్ వాళ్లు ఎలా ఉన్నారంటే, పేరెంట్స్ పర్మిషన్ తీసుకోవడానికి ఎదురుచూడటం లేదు. కేవలం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంతే. నేను కూడా అదే ఇన్ఫర్మేషన్ కోసం ఎదురుచూస్తున్నాను" అంటూ ముగించారు.

కాగా, మరి కొద్ది రోజుల్లో జూన్ 23న సోనాక్షి పెళ్లి జరగనుందని రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ వేడుకకు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో పాటు హీరామండి డైరక్టర్ సంజయ్ లీలా బన్సాలీ, సహ నటులు ఫర్దీన్ ఖాన్, తహ షా బాదుషా, అదితీ రావు హైదరీ, షర్మిన్ సెగల్‌లు కూడా హాజరవుతారని సమాచారం.

ఇకపోతే సోనాక్షి సిన్హా, జహీర్ ఇఖ్బాల్ కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారనే విషయం సినీ మీడియాకు మొత్తం తెలిసిందే. కానీ, వారిద్దరూ ఎప్పుడు కూడా బహిరంగంగా తమ రిలేషన్ గురించి ప్రకటించలేదు. 2022లో వచ్చిన డబుల్ XL సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. అందులో హ్యుమా ఖురేషి లీడ్ రోల్‌లో కనిపించారు.

'నా కూతురు పెళ్లా? నాకేం చెప్పలేదే' రూమర్స్​పై సోనాక్షి తండ్రి కామెంట్స్ - Sonakshi Sinha Marriage

హీరోయిన్​ బాత్రూమ్​లో దూరిన అభిమాని.. పెళ్లి చేసుకోవాలంటూ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.