Ranveer singh Deepika Padukone Daughter : బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ జంట ఇటీవలే ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన భార్య దీపికా పదుకొణె, కుమార్తె గురించి రణ్‌వీర్ ఆసక్తికర విషయాలు చెప్పారు. తండ్రైన తర్వాత తొలిసారి తన కొత్త చిత్రం 'సింగమ్ అగైన్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు రణ్‌వీర్. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే దీపిక ప్రెగ్నెంట్ అయ్యారంటూ గుర్తు చేసుకున్నారు.
"రోహిత్ శెట్టి సింగం ప్రాంఛైజీలో మరోసారి భాగమైనందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నా భార్య దీపికా పదుకొణె కూడా నటించారు. మాస్ అవతార్‌లో దీపికను చూడటం నాకు ఆనందంగా అనిపించింది. ప్రస్తుతం ఆమె తల్లి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. పాపను చూసుకోవడంలో ఫుల్ బిజీగా ఉన్నారు. అందుకే ఇప్పుడు ఈ ఈవెంట్‌కు రాలేదు. రాత్రిపూట పాపను నేనే చూసుకుంటాను. అందుకే ఇప్పుడు వచ్చాను. ఈ చిత్రంతో రోహిత్ శెట్టి యూనివర్స్‌లోకి దీపిక ఎంట్రీ ఇచ్చిందంటూ అందరూ అంటున్నారు. కానీ వాస్తవానికి ఇది మా కూతురి మొదటి సినిమా. ఎందుకంటే ఈ మూవీ షూటింగ్ సమయంలోనే దీపిక ప్రెగ్నెంట్ అయ్యారు" అంటూ రణ్‌వీర్ అన్నారు. తన కూతురే లిటిల్ సింబా అంటూ చెప్పుకొచ్చారు.
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె- రణ్‌వీర్ సింగ్ ఆరేళ్ల ప్రేమ తరువాత 2018లో పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా ఒకరికొకరు టైమ్ ఇచ్చుకుంటూ హ్యాపీగా కనిపించే ఈ జంట బాలీవుడ్‌లోనే 'ది మోస్ట్ క్యూట్ కపుల్'గా పేరు పొందింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాము త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామంటూ దీపిక తన ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేశారు. తమ బిడ్డ సెప్టెంబర్‌లో జన్మించే అవకాశం ఉందని పిల్లల బట్టలు, బూట్లు ఉన్న ఫోటోకి 'సెప్టెంబర్ 2024' అనే క్యాప్షన్ యాడ్ చేసి ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేశారు. ఇక అప్పట్నుంచి కాబోయే అమ్మగా తన మధుర జ్ఞాపకాల్ని అభిమనులతో పంచుకుంటూ వచ్చిన దీపిక తాజాగా ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఇప్పుడు ఆమె పాపను చూసుకుంటూ బిజీగా ఉన్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపించి అభిమానులను అలరిస్తున్నారు.
మళ్లీ ఇన్నాళ్లకు 'ఒక్కడు' కాంబో రిపీట్! - Bhumika Chawla New Movie
రజనీ కాంత్ వేలు పెట్టడం వల్లే నా సినిమా ఫ్లాప్! - ప్రముఖ దర్శకుడు ఆరోపణలు - Rajinikanth Flop Movie