Shruti Haasan Latest Interview : సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ తమ పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫషన్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ రాణిస్తుంటారు. అయితే కొన్ని సార్లు తమ పర్సనల్ లైఫ్‌లో వచ్చిన ఇబ్బందుల వల్ల ఆ స్టార్స్ ప్రొఫెషనల్‌గానూ నిలదొక్కుకునేందుకు కష్టపడుతుంటారు. ఓ స్టార్ హీరోయిన్ విషయంలో ఇలాగే జరిగింది. రూ. 650 కోట్లు వసూలు చేసిన సినిమాలో నటించిన ఆమె ఒకానొక కాలంలో డిప్రెషన్లోకి వెళ్లి తాగుడుకు బానిసైనట్లు స్వయంగా తెలిపింది. ఇంతకీ ఆయన హీరోయిన్ మరెవరో కాదు ఇటీవలే 'సలార్' సూపర్ సక్సెస్ అందుకున్న కోలీవుడ్ హీరోయిన్ శ్రుతి హాసన్. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఎందుకు అలా అయ్యారో చెప్పుకొచ్చింది.
2016లో మైఖేల్ కాస్లే అనే వ్యక్తితో ప్రేమలో పడింది శ్రుతి హాసన్. 2019 వరకు అతడితో రిలేషన్షిప్ కంటిన్యూ చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఇద్దరూ విడిపోయారు. తన ప్రేమ విఫలమవ్వడం వల్ల మానసికంగా తీవ్ర వేదన అనుభవించిన శ్రుతి హాసన్, ఒత్తిడిని ఎలా ఎదుర్కొవాలో తెలియక తాను తాగుడుకు బానిసైనట్లు పేర్కొంది. రోజంతా తాగుతూనే ఉండేదానంటూ పేర్కొంది. ఆ చెడు అలవాట్ల కారణంగా ఆరోగ్యం సైతం దెబ్బతిని ఒకానొక సమయంలో సినిమాలపై ఫోకస్ చేయలేకపోయానంటూ భావోద్వేగానికి లోనైంది.
అయితే వాటి నుంచి ఎలా జయించాలో తెలియక తీవ్రఇబ్బందులు పడ్డానంటూ తెలిపిన శ్రుతి, ఆ తర్వాత ఆ పరిస్థితులను ఎదుర్కొని వాటి నుంచి బయిటపడ్డట్లు తెలిపింది. ఇప్పుడు అన్ని అలవాట్లకు దూరంగా ఉంటూ తన కెరీర్లో రాణించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం సరిగ్గా లేదని, తన వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవటం ఇష్టం లేదని తెలిపింది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి తగిన చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమె శాంతను హజారికా అనే వ్యక్తితో రిలేషన్లో ఉంది. ఈ ఇద్దరూ తరచూ తమ ఫొటోలతో నెట్టింట సందడి చేస్తుంటారు.
'అందుకే రణ్‌బీర్‌ను కొట్టాను - ఆ క్షణం కన్నీళ్లు ఆగలేదు'
ఓవర్‌సీస్‌లో 'హనుమాన్' మేనియా - ఈ సారి మహేశ్ రికార్డులు బ్రేక్!