Shraddha Kapoor Shah Rukh Khan: బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తాజాగా 'స్త్రీ 2' మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమాకి అభిమానులు, విమర్శకుల నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ సినిమాలో నటించిన శ్రద్ధా కపూర్ ప్రస్తుతం మూవీ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తోంది. అయితే బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన శ్రద్ధా, ఇంకా కొందరు స్టార్ హీరోల సరసన యాక్ట్ చేయలేదు. ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌తో పని చేయలేదు. ఆమె చెప్పిన కారణం ఏంటంటే?
ఇటీవల శుభంకర్ మిశ్రాతో పోడ్‌కాస్ట్‌లో శ్రద్ధా పాల్గొంది. తనకు ఇంకా బాలీవుడ్‌లోని ముగ్గురు ఖాన్‌లతో పనిచేసే అవకాశం రాలేదని చెప్పింది. 'చాలా సార్లు మీకు సినిమా ఆఫర్ వస్తుంది. కానీ అందులోని పాత్ర అంత ఎక్సైటింగ్‌గా అనిపించకపోతే లేదా నాలోని ఆర్టిస్ట్‌కి ఛాలెంజింగ్‌గా లేకపోతే సినిమాను వదులుకుంటాను. నేను వర్క్‌ని ఎంపిక చేసుకోవడంలో క్లియర్‌గా ఉంటాను' శ్రద్ధా అని చెప్పింది. ఆకట్టుకునే స్టోరీలు, క్వాలిటీ ఫిల్మ్స్‌లో భాగమవ్వాలని, ప్రతిభావంతులైన దర్శకులు, నటీనటులతో కలిసి పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె పేర్కొంది. ఈ విధానంలోనే పాపులర్ స్టార్స్‌తో కలిసి పనిచేసే అవకాశం లభిస్తే, అలాంటి అవకాశాలను అంగీకరించడానికి ఇష్టపడతానని చెప్పింది.
సెలబ్రేషన్స్ ఫుల్ జోష్‌లో
'స్త్రీ 2' మూవీ సక్సెస్‌ని టీమ్ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ ఈవెంట్‌కి సంబంధించిన వీడియో ఇటీవల వైరల్‌గా మారింది. వైరల్ వీడియో క్లిప్‌లో శ్రద్ధా కపూర్, ఆమె సహనటుడు అభిషేక్ బెనర్జీ పాపులర్ భోజ్‌పురి పాట 'ఆయీ నై'కి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ జంట హుషారుగా వేస్తున్న స్టెప్పులతో అక్కడున్న వాతావరణం మరింత సందడిగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.
అంతకుముందు తమన్నా భాటియా, శ్రద్ధా కపూర్, కృతి సనన్ కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. తమన్నా తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి ఈలలు వేస్తూ 'స్త్రీ 2'లోని తన సాంగ్ 'ఆజ్ కీ రాత్'కు డ్యాన్స్ చేసింది. మరో వీడియోలో తమన్నా, కృతి సనన్ కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. దర్శకుడు అమర్ కౌశిక్, నటుడు అభిషేక్ బెనర్జీ, రాధిక మదన్ వారిని ఎంకరేజ్ చేస్తూ కనిపించారు. విజయ్ కూడా చిన్నగా కాలు కదిపాడు.
ఎక్కువ సీన్స్ అందుకే లేవు!
సినిమాలో శ్రద్ధా కపూర్ తక్కువ స్క్రీన్ టైమ్ గురించి వస్తున్న ప్రశ్నలకు, ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కౌశిక్ కపూర్ సమాధానం చెప్పాడు. శ్రద్ధా తరచుగా సీన్స్‌లో కనిపిస్తే, ఆమె పాత్ర డ్రమాటిక్ ఎంట్రెన్స్ ఇంటెన్సిటీ తగ్గిపోయేదని వివరించాడు. ఈ మూవీలో రాజ్‌కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ కూడా నటించారు. అక్షయ్ కుమార్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడు.