Shahrukh Khan Love Intrest : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అవుతుంటారు ఫ్యాన్స్. ఇక సెలబ్రిటీల్లోనూ ఆయన ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఇప్పటికీ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు చాలా మంది సెలబ్రిటీలు వెయిట్ చేస్తుంటారు. ఇలా భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ ఈ స్టార్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ నటుడు మాత్రం ఓ స్పోర్ట్స్ స్టార్‌కు ప్రేమికుడిగా కనిపించాలనుకున్నారట. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న 'ది కపిల్ శర్మ'కు లేటెస్ట్గా పలువురు స్ప్రోర్ట్స్ స్టార్స్ సందడి చేశారు. అందులో సానియా మిర్జా, మేరీ కామ్, సైనా నెహ్వాల్, సిఫ్ట్ కౌర్ శర్మ లాంటి ప్లేయర్లు వచ్చారు. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఓ స్పెషల్ ప్రోమో విడుదలైంది. అందులో ఈ స్టార్స్ అందరినీ హోస్ట్ కపిల్ పలు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు. ఈ నేపథ్యంలో హోస్ట్ కపిల్ ఈ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఓ ఇంటర్వ్యూలో షారుక్ ఖాన్ అన్న మాటలను గుర్తు చేశారు.
"ఒకవేళ సానియా మీర్జాపై బయోపిక్ తీస్తే అందులో ఆమె లవ్ ఇంట్రెస్ట్ ( ప్రేమికుడి)గా నేను నటించాలని అనుకుంటున్నా" అంటూ షారుక్ చెప్పారని కపిల్ అన్నారు. అది విన్న సానియా వెంటనే "ఇప్పుడు నేను లవ్ ఇంట్రెస్ట్‌ను వెతుక్కోవాలి" అని సరదాగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో పాటు సానియా, షారుక్‌కు సంబంధించిన ఓ పాత వీడియో కూడా ట్రెండ్ అవుతోంది.
సానియా బయోపిక్ బుక్ లాంఛ్ ప్రొగ్రామ్‌కు గెస్ట్‌గా వచ్చిన షారుక్ ఖాన్ సానియాను ఉద్దేశించి 'యే చాంద్ సా రోషన్ చెహ్రా' అనే ఓ బాలీవుడ్ పాట పాడారు. ఏ మీటింగ్‌లో అయినా మహిళలకు రెస్పెక్ట్ ఇస్తూ, మోటివేటింగ్‌గా మాట్లాడుతూ మనసులు గెలుచుకోవడం కొత్త కాదు కదా. ఇప్పుడు ఈ వీడియోతోనూ ఆయన మళ్లీ అభిమానులను ఫిదా చేశారు.
ఇది బాద్ షా రేంజ్ - వామ్మో లండన్‌లో షారుక్ లగ్జరీ బంగ్లా అన్ని కోట్లా!