Shahrukh Khan Income Tax Payment : ఆదాయ పన్ను కట్టే విషయంలో తాజాగా టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రూ. 66 కోట్లతో రికార్డు నమోదు చేయగా, తాజాగా దాన్ని బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ అధిగమించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను షారుక్ ఏకంగా రూ.92 కోట్లు ట్యాక్స్ కట్టినట్లు ప్రముఖ సంస్థ ఫార్చూన్ ఇండియా తెలిపింది. అయితే విజయ్ రూ. 80 కోట్లు, సల్మాన్ ఖాన్ రూ. 75 కోట్లు బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ రూ.71 కోట్లు చెల్లించినట్లు ఆ సంస్థ వెల్లడించింది.
భారతీయ సెలబ్రిటీలందరిలో రూ.92 కోట్లతో షారుక్ అత్యధికంగా పన్ను చెల్లించినట్లు నివేదిక పేర్కొంది. ఆ తర్వాత స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (రూ.80 కోట్లు), సల్మాన్ ఖాన్ (రూ.75 కోట్లు) వారి తర్వాత రూ.66 కోట్లతో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నారు. ఆరులో అజయ్ దేవగణ్ (రూ.42 కోట్లు), రూ.38 కోట్ల పన్ను చెల్లించి ఎంఎస్ ధోనీ ఏడో స్థానంలో ఉన్నారు. రణ్‌బీర్ కపూర్ రూ.36 కోట్లు చెల్లించి ఎనిమిదో స్థానంలో ఉండగా.. హృతిక్ రోషన్, సచిన్ తెందూల్కర్‌లు రూ.28 కోట్లతో తర్వాత స్థానాల్లో నిలిచారు.
టాప్ 20 జాబితాలో క్రికెటర్లు
సౌరవ్ గంగూలీ- రూ.23 కోట్లు
హార్దిక్ పాండ్యా- రూ.13 కోట్లు
రిషబ్ పంత్ - రూ.10 కోట్లు
టాప్ 20 జాబితాలో ఉన్న మరికొందరు సినీ సెలబ్రిటీలు
కపిల్ శర్మ - రూ.26 కోట్లు
షాహిద్ కపూర్- రూ.14 కోట్లు
మోహన్‌లాల్ - రూ.14 కోట్లు
అల్లు అర్జున్ - రూ.14 కోట్లు
కియారా అడ్వాణీ - రూ.12 కోట్లు
కత్రినా కైఫ్ - రూ.11 కోట్లు
పంకజ్ త్రిపాఠి - రూ.11 కోట్లు
ఆమిర్ ఖాన్ - రూ.10 కోట్లు
ఇక షారుక్ సినిమాల విషయానికొస్తే సుజయ్ ఘోష్ తెరకెక్కిస్తున్న 'కింగ్' సినిమాలో నటిస్తున్నారు షారుక్. ఇందులో సుహానా ఖాన్‌తో పాటు అభిషేక్ బచ్చన్, అభయ్ వర్మలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అండర్ వరల్డ్ కింగ్‌లా వ్యవహరించే పాత్రలో కనిపిస్తున్నారు షారుక్. థ్రిల్లింగ్ కథాంశంతో తెరకెక్కిస్తున్నామని సినిమా యూనిట్ చెబుతోంది.
సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ టు మిస్ కర్ణాటక- మోడలింగ్‌లో KGF బ్యూటీ జర్నీ ఇలా! - Srinidi Shetty