ETV Bharat / entertainment

సెప్టెంబర్​లో సినిమా పండగ- కళ్లన్నీ 'దేవర', 'గోట్'పైనే- లిస్ట్​లో 'ఎమర్జెన్సీ' కూడా - September Movies 2024

September Movies 2024: ఆకట్టుకోని ఆగస్టు సినిమాలను పక్కకు పెట్టి సెప్టెంబరు దూసుకొస్తుంది. సెప్టెంబర్ 5న విజయ్ మూవీతో బోనీ కొట్టిన తర్వాత నెలాఖరులో ఎన్టీఆర్ హీరోగా 'దేవర పార్ట్ 1' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలతో పాటు మరి ఏయో సినిమాలు థియేటర్లలోకి రానున్నాయంటే?

September Movies
September Movies (Source: ETV Bhatat, ANI (Kangana))
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2024, 5:08 PM IST

September Movies 2024: వినాయక చవితి పండుగ సెప్టెంబర్ 7న అయితే రెండ్రోజుల ముందు నుంచే సినిమా పండుగ మొదలైపోనుంది. అలా మొదలైన వరుస సినిమాలు సినీ ప్రేక్షకులకు నెల మొత్తం కన్నుల విందు కానున్నాయి. 'ది గ్రేటెస్ట్ ఆఫ్ టైమ్' (ది గోట్)తో దళపతి విజయ్ గ్రాండ్ ఓపెనింగ్ చేయనున్నాడు. వెంకట్ ప్రభు డైరక్షన్‌లో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది. నెల చివర్లో అంటే సెప్టెంబర్ 27న ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర పార్ట్ 1 వరకూ లైను పెట్టిన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పండగే పండగ.

ది గోట్: విజయ్ దళపతి హీరోగా రెడీ అవుతున్న 'ద గోట్' సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నారు. మీనాక్షి చౌదరీ హీరోయిన్. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి దివంగత నటుడు విజయ్ కాంత్ కూడా ఇందులో కనిపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అంచనాలకు అతీతంగా సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే ఉంటాయని డైరక్టర్ చెబుతున్నారు.

35 చిన్న కథ కాదు: నివేదా ధామస్ ప్రధాన పాత్రలో రెడీ అవుతున్న '35 చిన్న కథ కాదు' కామెడీతో పాటు ఆలోచింపజేసే కథతో ముస్తాబుకానుంది. ఇందులో ఇతర ప్రధాన పాత్రలో ఆర్. ప్రియదర్శి నటిస్తున్నారు. నందకిశోర్ ఇమాని రూపొందించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న రానా సమర్పణలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సుందరకాండ: చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత నారా రోహిత్ నటించిన సినిమా రిలీజ్ కానుంది. 'సుందరకాండ' అనే లవ్ స్టోరీతో ఒకే రోజున అంటే సెప్టెంబర్ 6నే రిలీజ్ కానుంది. నారా రోహిత్ సరసన విర్తి వాఘవి హీరోయిన్ గా కనిపించనున్నారు. దీనికి దర్శకత్వం వెంకటేశ్ నిమ్మలపూడి వహిస్తున్నారు.

ఎమర్జెన్సీ: కాంట్రవర్షియల్ హీరోయిన్, బాలీవుడ్ నటి అయిన కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో ఓ బయోపిక్‌తో రానుంది. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తున్న ఆమె అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సందర్భాన్ని తీసుకుని కథ సిద్ధం చేసుకున్నారు. ఇది కూడా రిలీజ్ అయ్యేది సెప్టెంబర్ 6నే.

జనక అయితే గనక: అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ ఫేమ్ సుహాస్ హీరోగా రెడీ అయింది 'జనక అయితే గనక', రాజ్ తరుణ్ హీరోగా 'భలే ఉన్నాడే' లాంటి రొమాంటిక్ కామెడీ, హుషారు సినిమా ఫేం తేజస్ కంచెర్ల ప్రధాన పాత్రలో 'ఉరుకు పటేలా' లాంటి సినిమాలన్నీ సెప్టెంబర్ 7న బాక్సాఫీసు బరిలోకి దిగనున్నాయి.

వారమంతా చిన్న సినిమాలే
ఆ తర్వాతి వారం అయిన సెప్టెంబర్ సెకండ్ వీక్ మొత్తం చిన్న సినిమాలదే. కామెడీ థ్రిల్లర్ 'మత్తు వదలరా 2'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు శ్రీసింహ. దాంతో పాటుగా ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, రెజీనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఉత్సవం సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ కానుంది. ఇందులో హీరోగా చేతన్ కృష్ణ 'ధూం ధాం' నటిస్తున్నారు. ఇక అదే రోజు యంగ్ హీరో రాజ్​తరుణ్ 'భలే ఉన్నాడు' సినిమా కూడా రిలీజ్ కానుంది.

దేవరతో ఎండ్: చివరిగా సెప్టెంబర్ 27న 'దేవర పార్ట్ 1'తో సూపర్ ఫినిషింగ్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు ఎన్టీఆర్. కొరటాల శివ డైరక్షన్ లో తెలుగులో తొలి సారి శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాలో నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్‌ది ఇందులో డ్యూయెల్ రోల్.

OTTలో హారర్ మూవీస్ చూడాలా- బెస్ట్​ లిస్ట్​ ఇదే! - Horror Movies OTT

బీటౌన్‌లో రీరిలీజ్‌ల జోరు - పరిశ్రమ వర్గాలు ఏమంటున్నాయంటే? - Re Release Trend In Bollywood

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.