ETV Bharat / entertainment

'కోపాన్ని వారంలో ఒక్కరోజు మాత్రమే చూపిస్తాడు' - ఆసక్తికంగా నాని అప్​కమింగ్ మూవీ టీజర్​ - Saripodhaa Sanivaaram movie

Saripodhaa Sanivaaram Teaser : నేచురల్​ స్టార్ నాని లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. నేడు ( ఫిబ్రవరీ 24న) నాని బర్త్​డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టీజర్​ను రిలీజ్ చేశారు. ఆ విశేషాలు మీ కోసం

Saripodhaa Sanivaaram Teaser
Saripodhaa Sanivaaram Teaser
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 12:10 PM IST

Updated : Feb 24, 2024, 1:27 PM IST

Saripodhaa Sanivaaram Teaser : హాయ్​ నాన్న సినిమాతో మాసివ్ బ్లాక్​బస్టర్ అందుకున్న నేచురల్ స్టార్​ నాని ప్రస్తుతం గ్యాప్​ లేకుండా వరుస షెడ్యుల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన లీడ్​ రోల్​లో డివివి దానయ్య ఎంటర్​టైన్​మెంట్స్​ సరిపోదా శనివారం అనే మూవీని తెరక్కిస్తోంది. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, టైటిల్ రివీల్ వీడియో ఆడియెన్స్​ను ఆకట్టుకోగా, తాజాగా వచ్చిన టీజర్ అభిమానుల్లో ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. నాని బర్త్​డే సందర్భంగా రిలీజ్​ చేసిన ఈ గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఇందులో నాని సూర్య అనే పాత్రలో కనిపించారు.

"కోపాలు ర‌క‌ ర‌కాలు. ఒక్కో మనిషికి కోపం ఒక్కోలా ఉంటుంది. కానీ ఆ కోపాన్ని క్రమబద్ధంగా, పద్దతిగా వారంలో ఒక్క రోజు మాత్రమే చూపించే పిచ్చొడిని ఎవరైనా చూశారా ?. నేను చూశాను" అంటూ ఎస్​ జే సూర్య చెప్పే డైలాగ్​తో ఈ గ్లింప్స్​ మెదలైంది. ఇందులో నాని ఓ అగ్రెసివ్​ రోల్​లో కనిపించారు. లుక్​, ఫైట్స్​ ఇలా అన్ని ఆకట్టుకునేలా ఉన్నాయని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Saripodhaa Sanivaaram Cast : ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో నానితో ప్రియాంక అరుల్ మోహన్​ నటిస్తున్నారు. గ్యాంగ్ లీడర్​ తర్వాత ఈ జంట సరిపోదా శనివారంలో అలరించనుంది. మరోవైపు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్​జే సూర్య ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆయన ఓ పోలీస్​ ఆఫీసర్​ రోల్​లో కనిపించారు. ఇక ఈ మూవీకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అయితే అంటే సుందరానికి తర్వాత నాని - వివేక్ కలిసి పనిచేస్తున్న రెండో సినిమా ఇది​. మరోవైపు పాన్ ఇండియా లెవెల్​లో ఈ మూవీ రిలీజ్​ కానుంది. గ్లింప్స్​లో ఈ సినిమా రిలీజ్​ డేట్​ను కూడా రివీల్​ చేశారు మేకర్స్​. ఆగస్టు 29న సినిమా విడుదల కానున్నట్లు ప్రకటించారు.

అసిస్టెంట్ డైరెక్టర్​ టు రూ.100 కోట్ల స్టార్ - అందరు హీరోల్లా నాని చేయకపోవడానికి కారణం ఇదే!

వాలెంటైన్స్​ డే స్పెషల్​ - జున్ను న్యూ ట్యాలెంట్​ - మురిసిపోయిన నాని

Last Updated : Feb 24, 2024, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.