SamaraSimha Reddy Re Release : తన సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ టాలీవుడ్లో దూసుకెళ్తుంటారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఇటీవలే 'వీరసింహారెడ్డి'లో సూపర్ హిట్ అందుకున్న ఈ స్టార్ హీరో, ఇప్పుడు ఎన్బీకే 109 షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే త్వరలో ఆయన సూపర్ హిట్ సినిమా ఒకటి థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. అదే 'సమరసింహా రెడ్డి'. 1999లో విడుదలైన ఈ సాలిడ్ యాక్షన్ మూవీ అప్పట్లోనే బాక్సాఫీస్‌ను ఓ ఆట ఆడేసుకుంది. థియేటర్లలో ఫ్యాన్స్ సందడి నడుమ సూపర్ హిట్ టాక్ దిశగా దూసుకెళ్లింది. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను మార్చి 2 న రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.
- ప్రజల కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసే ఓ శక్తివంతమైన ఫ్యాక్షన్ నాయకుడిగా బాలయ్య ఇందులో కనిపించారు.
- 1999లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మాసివ్ బ్లాక్‌బస్టర్ అందుకుంది. విడుదలైన అన్ని ఏరియాల్లోనూ రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూళ్లను చేసింది.
- ఈ సినిమా విడుదలై 25 ఏళ్లైన సందర్భంగా 4కే లో మేకర్స్ దీన్ని రీరిలీజ్ చేస్తున్నారు. నైజాంలో 100 థియేటర్లకు పైగా అలాగే ఆంధ్రాలో 250 పైగా, ఇక కర్ణాటకలో 50కి పైగా థియేటర్లలో ఈ సినిమా స్క్రీనింగ్ కానుంది. రీ మాస్టర్ చేసిన ప్రింట్‌తో పాటు 7.1 డాల్బీ సౌండ్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది.
- అప్పట్లో ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్‌తో చాలా మంది థియేటర్ల ఓనర్లు తమకొచ్చిన లాభాలతో రీ మోడలింగ్, సౌండ్ సిస్టం ఆధునీకరించుకున్నారంటూ పలు వార్తలు వచ్చాయి.
- ఫ్యాక్షన్ చిత్రాలకు బాలయ్యను కేరాఫ్ అడ్రెస్‌గా చేసింది ఈ మూవీ. దీని తర్వాత ఆయన ఇదే జానర్లో పలు సినిమాల్లో నటించి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు.
- ఈ మూవీ అప్పట్లోనే రూ. 22 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇక విడుదలైన 29 కేంద్రాల్లో ఈ మూవీ సిల్వర్ జూబ్లీ కూడా జరుపుకుంది.
- ఇందులో బాలకృష్ణతో పాటు సిమ్రాన్, అంజలా ఝవేరిలు నటించారు. జయప్రకాశ్, బ్రహ్మానందం, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాస రావు, పృథ్యీ కీలక పాత్రలు పోషించారు. ఇక మణిశర్మ మ్యూజిక్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">