ETV Bharat / entertainment

ఏడాది తర్వాత షూటింగ్ - మార్షల్​ ఆర్ట్స్​ నేర్చుకుంటున్న సామ్ - ఎందుకుంటే? - Samantha Upcoming Movies - SAMANTHA UPCOMING MOVIES

Samantha Upcoming Movies : గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్​, తాజాగా కమ్​బ్యాక్​ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పలు స్కిల్స్​ను మెరుగు పరుచుకునేందుకు శిక్షణ తీసుకుంటోందట. ఎందుకంటే?

Samantha Upcoming Movies
Samantha (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 20, 2024, 8:43 AM IST

Samantha Upcoming Movies : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. మయోసైటిస్​ కారణంగా గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె మంచి కమ్‌బ్యాక్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్‌ అభిమానులతో ముచ్చటించింది.

"వచ్చే ఏడాది నుంచి నేను షూటింగుల్లో పాల్గొననున్నాను. దాని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అందులోని పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నా. మార్షల్‌ ఆర్ట్స్, ఆర్చరీ, హార్స్ రైడింగ్, కత్తిసాము లాంటి విలువిద్యలు నేర్చుకుంటున్నా. ఈ ట్రైనింగ్ నాలోని పలు స్కిల్స్​ను మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయని అనుకుంటున్నాను. నేను నటించనున్న నెక్స్ట్​ ప్రాజెక్టుల కోసం ఉపయోగపడుతుందని భావిస్తున్నా. ప్రతి విషయాన్ని బాగా నేర్చుకుంటున్నా. తెలియని వాటిపై ఫోకస్​ పెడుతున్నా. నన్ను నేను నిర్వచించుకోవల్సి వస్తే మొదట నేను ఒక స్టూడెంట్​ అనే చెప్తాను. ఇక నేను ఈ సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదిహేనేళ్లు గడిచిపోయింది. అయినప్పటికీ నాకు ఇంకా ఇంది కొత్తగానే ఉంది. ఈ రంగంలో చేయాల్సింది, తెలుసుకోవల్సింది కూడా చాలా ఉన్నాయనేది నా భావన. సినిమాల్లో ఉన్న మ్యాజిక్కే అది. ఎన్ని సినిమాలు చేసిన అందులో పాత్రలు మనకింకా కొత్తవి నేర్పిస్తూనే ఉంటాయి. ప్రతి స్క్రిప్ట్‌తో విభిన్న పాత్రలోకి, వింత ప్రపంచంలోకి అడుగుపెట్టేలా చేస్తుంటాయి" అని సామ్​ వెల్లడించింది.

Samantha Upcoming Movies : గతేడాది రిలీజైన 'ఖుషి' తర్వాత సామ్ మరో చిత్రంలో కనిపించలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు 'మా ఇంటి బంగారం' సినిమాను అనౌన్స్ చేసింది. తన సొంత ప్రొడక్షన్​లో ఈ సినిమా తెరకెక్కనుంది. దీంతో పాటు త్వరలోనే సామ్​ సిటడెల్‌: హనీ- బన్నీ వెబ్​సిరీస్​తో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఇందులో వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించగా, 'ఫ్యామిలీ మ్యాన్​' ఫేమ్​ రాజ్‌ అండ్‌ డీకే ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేశారు. దీంతో పాటు ఈ స్టార్ డైరెక్టర్లు తెరకెక్కించే మరో ప్రాజెక్ట్​కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

వార్నింగ్​ ఇచ్చిన డాక్టర్​కు సమంత స్ట్రాంగ్ రిప్లై!

నువ్వు వారియర్ - నీకోసం ప్రార్థిస్తుంటాను : సమంత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.