ETV Bharat / entertainment

ఒకప్పుడు స్టార్ హీరో‌ షూస్ మోసిన అసిస్టెంట్‌ - ఇప్పుడు సినిమాకు రూ.100 కోట్లు తీసుకునే స్టార్​! - సల్మాన్ ఖాన్ జాకీ ష్రాఫ్

ఒకప్పుడు స్టార్ హీరోకు అసిస్టెంట్‌గా పని చేసిన ఓ కుర్రాడు ప్రస్తుతం ఓ సినిమాకు హీరోగా రూ. 100 కోట్ల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగాడు. ఎవరంటే?

ఒకప్పుడు స్టార్ హీరో‌ షూస్ మోసిన అసిస్టెంట్‌ - ఇప్పుడు సినిమాకు రూ.100 కోట్లు తీసుకొనే స్టార్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 9:47 AM IST

సినీ ఇండస్ట్రీలో ఎవరి ఫేట్ ఎప్పుడు మారుతుందో చెప్పలేం. అప్పటి వరకు స్టార్ హీరోలుగా రాణించిన వారు క్యారెక్టర్​ ఆర్టిస్టులుగా మారిపోతుంటారు. సైడ్ క్యారెక్టర్​ వేసే వారు ఓవర్​నైట్ స్టార్స్​గానూ ఎదిగిపోతారు. ఇలాంటి సంఘటనలు చిత్ర సీమలో ఎన్నో. అయితే ప్రస్తుతం ఫిల్మ్​ ఇండస్ట్రీలో ఒక్కప్పుడు ఓ స్టార్ హీరోకు(జాకీష్రాఫ్​) అసిస్టెంట్‌గా పని చేసిన ఓ కుర్రాడు ప్రస్తుతం ఓ సినిమాకు రూ. 100 కోట్ల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగాడు.

వివరాల్లోకి వెళితే. బాలీవుడ్​గా మోడల్‌గా కెరీర్​ ప్రారంభించిన జాకీ ష్రాఫ్ మొదట ఓ చిన్న పాత్రతో సినీ జర్నీని ప్రారంభించారు. ఆ తర్వాత 'హీరో' సినిమా ఆయన కెరీర్​ మలుపు తిప్పింది. సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్​గా నిలవడం వల్ల జాకీ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయారు. అనంతరం ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. పలు అవార్డులను కూడా అందుకున్నారు.

అలా జాకీ ష్రాఫ్ బీటౌన్​లో స్టార్ హీరోగా రాణిస్తున్న రోజుల్లో ప్రముఖ రచయిత, దర్శకుడు సలీం ఖాన్ దర్శకత్వంలో ఓ సినిమా చేశారు. 1988లో ఫలక్ అనే పేరుతో వచ్చిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్​నే అందుకుంది. ఈ చిత్రానికి సలీం ఖాన్ కుమారుడు, ప్రస్తుతం సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ మూవీ షూటింగ్​ సమయంలో జాకీ ష్రాఫ్‌కు అసిస్టెంట్‌గా ఉన్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ గురించి జాకీ ష్రాఫ్ మాట్లాడారు. సలీం ఖాన్​ దర్శకత్వంలో ఫలక్ సినిమా చేసే సమయంలో సల్మాన్ ఖాన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. నా పాత్రకు కావాల్సిన క్యాస్టూమ్స్, షూస్, ఇతర వస్తువులకు సంబంధించి తనే చూసుకునేవాడు. అతడి ఫొటోలను నేను వేరే నిర్మాతలకు, దర్శకులకు చూపించి అవకాశాలు ఉంటే చెప్పమనేవాడిని. అదే సమయంలో సల్మాన్ ఖాన్ నటించిన మైనే ప్యార్ కియా సినిమా విడుదలై హిట్ కొట్టింది. సల్మాన్​కు స్టార్​డమ్​ను అందించింది. అలా మా స్నేహం మొదలైంది." అని జాకీ చెప్పుకొచ్చారు.

Salman Khan Remuneraion : సల్మాన్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే - బీవీ హో తో ఐసీ అనే సినిమాతో కెరీర్ ప్రారంభించారు సల్మాన్​. ఇందులో సపోర్టింగ్ రోల్ చేశారాయన. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. ఆ సమయంలో మైనే ప్యార్ కియా సినిమా హిట్ అవ్వడం సల్మాన్​కు బ్రేక్​ ఇచ్చింది. అనంతరం ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.100 నుంచి రూ.130కోట్ల వరకు పారితోషికం తీసుకునే రేంజ్​లో పాపులారిటినీ సంపాదించుకున్నారు. ఆయన నెట్ వర్త్​ రూ.2900కోట్లు అని సమాచారం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్​ హారర్ మూవీ - భయపడకుండా చూడగలరా?

షాకింగ్​ : విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.