ETV Bharat / entertainment

సల్మాన్​ పేరుతో మోసం - వారికి హీరో టీమ్ స్ట్రాంగ్​ వార్నింగ్​! - సల్మాన్ ఖాన్ ఫేక్ ప్రొడక్షన్ హౌస్​

Salman Khan Production House : 'సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌' పేరుతో కొందరు మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారంటూ బాలీవుడ్ హీరో సల్మాన్‌ ఖాన్‌ టీమ్​ తాజాగా హెచ్చరించింది. ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ పేరు చెప్పి అవకాశాలు ఇస్తామని మోసం చేస్తున్నట్లు పేర్కొంది.

Salman Khan Production House
Salman Khan Production House
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 7:21 PM IST

Updated : Jan 31, 2024, 9:22 PM IST

Salman Khan Production House : తన పేరుపై ఓ ఫేక్​ ప్రొడక్షన్ హౌస్​ను క్రియేట్ చేసి కొందరు మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారంటూ తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ టీమ్ పేర్కొంది. అయితే వారిని నమ్మొద్దంటూ టీమ్​ తాజాగా హెచ్చరించారు. ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ పేరు చెప్పి అవకాశాలు ఇస్తామని మోసం చేసేందుకు యత్నిస్తున్నారంటూ సల్మాన్ టీమ్​ తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది.

"సల్మాన్‌ ఖాన్‌, ఆయన ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రస్తుతం ఏ సినిమాకు ఆడిషన్స్​ను నిర్వహించడం లేదు. ఇందుకోసం ఏ ఏజెన్సీని కూడా నియమించుకోలేదు. మా పేరుతో వచ్చే ఫోన్లు, ఈమెయిల్స్​ను అస్సలు నమ్మొద్దు. అలా మోసం చేసే వారిపై త్వరలోనే మేము లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటాం. ఆయన పేరును ఉపయోగించి నేరాలకు పాల్పడితే కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అంటూ సల్మాన్‌ టీమ్ వార్నింగ్ ఇచ్చింది.

అయితే ఇలా సల్మాన్ పేరును ఉపయోగించుకుని మోసాలకు పాల్పడడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ కొందరు ఇలా ఫేక్‌ ఈమెయిల్స్‌ చేస్తే, అప్పుడు కూడా టీమ్ స్పందించింది. 2011లో సల్మాన్‌ఖాన్‌ ప్రొడక్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీని ప్రారంభించారు. దీనినుంచి వచ్చే డబ్బులను ఆయన ఛారిటీకి ఉపయోగిస్తారు.

Salman Khan Upcoming Movies : ఇక సల్మాన్​ ఖాన్ సినిమాల విషయానికొస్తే - ఇటీవలే ఆయన 'టైగర్‌ 3' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. యశ్​ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మించారు. మనీశ్​ శర్మ తెరకెక్కించిన ఈ మూవీకి ప్రీతమ్, తనూజ్​ టింకూ సంగీతం సమకూర్చారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్​ కత్రినా కైఫ్, సల్మాన్​కు జంటగా నటించగా, నటుడు ఇమ్రాన్​ హష్మీ విలన్‌ పాత్రలో కనిపించారు. ఇక సిమ్రన్, రిధి డోగ్రా, విశాల్ జెత్వా, కుముద్ మిశ్రా, రణ్‍వీర్​ షోలే తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకుంది. దీని తర్వాత త్వరలోనే షారుక్‌తో కలిసి సిద్ధార్థ్‌ ఆనంద్‌ డైరెక్షన్​లో రానున్న ఓ మల్టీస్టారర్‌ సినిమాలో నటించనున్నారు. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భారీ ఫైట్​ సీన్స్​ను చూపించనున్నట్లు ఇటీవలే మూవీ టీమ్​ పేర్కొంది.

బాలీవుడ్​లో త్రిష రీ ఎంట్రీ!- సల్మాన్​తో స్క్రీన్ షేరింగ్ నిజమేనా?

సల్మాన్​ ఖాన్​కు బెదిరింపులు! - చావుకు వీసా అక్కర్లేదంటూ వార్నింగ్!

Last Updated : Jan 31, 2024, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.